టాలీవుడ్ జూలై రిపోర్ట్ .. హిట్స్ అండ్ ఫ్లాప్స్

తెలుగు సినిమా పరిశ్రమకు ఫస్ట్ హాఫ్‌ పెద్దగా కలిసి రాలేదు. సంక్రాంతి ఇచ్చిన ఊపును కంటిన్యూ చేయడంలో టాలీవుడ్ ఫెయిల్ అయింది. జనవరిలో వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఫిబ్రవరిలో ఒక్క హిట్టూ లేదు. మార్చిలో బలగం, దసరా చిత్రాలు హిట్ అందుకున్నాయి. ఏప్రిల్ లో విరూపాక్ష మాత్రమే విజయం సాధించింది. భారీ అంచనాల మధ్య మే మూవీస్ ఏవీ పాజిటిక్ టాక్ తెచ్చుకోలేదు. జూన్ ఆఖర్లో వచ్చిన సామజవరగమన మాత్రమే బ్లాక్ బస్టర్ అయింది.

అలా టాలీవుడ్ ఫస్ట్ హాఫ్‌ నీరసంగా ముగిసిపోయింది. దీంతో ఇక సెకండ్ హాఫ్‌ అయినా ఆకట్టుకుంటుందేమో అనుకున్నారు. బట్ ఆరంభంలోనే సెకండ్ హాఫ్ కూడా నిరాశపరిచింది.
జూలై ఫస్ట్ వీక్ 7వ తారీఖున రికార్డ్ స్థాయిలో 8 సినిమాలు విడుదలయ్యాయి. రుద్రంగి, భాగ్ సాలే, సర్కిల్, లిలి, ఓ సాథియా, 7:11పి.ఎమ్, రంగబలి చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో రంగబలిపై అంచనాలున్నాయి. ఫస్ట్ హాఫ్ హిట్ అనిపించుకున్నా.. సెకండ్ పూర్తిగా నిరాశపరిచింది.


జూలై 14న భారీ అంచనాలతో వచ్చిన బేబీ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇంకా స్టడీగానే ఉంది. ఇదే రోజు రివెంజ్ అనే సినిమా వచ్చినా దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇక 20న అశ్విన్ బాబు హిడింబ మూవీ విడుదలైంది.ఈ చిత్రానికి వాళ్లు ఆశించిన కలెక్షన్స్ వచ్చాయని చెప్పారు కానీ జనరల్ గా హిట్ అనే టాక్ తెచ్చుకోలేదు. 21న అన్నపూర్ణ ఫోటో స్టూడియో, నాతో నేను, హర్ – చాప్టర్ 1,అలా ఇలా ఎలా అనే చిత్రాలు విడుదలయ్యాయి. బట్ ఇవి కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాయి.


ఇక లాస్ట్ పంచ్ మనదే అన్నట్టుగా పవన్ కళ్యాణ్‌ బ్రో సినిమా 28న విడుదలైంది. ఈ మూవీకి ఓపెనింగ్స్ బావున్నాయి. బట్ టాక్ మాత్రం మిక్స్ డ్ గానే ఉంది. పవన్ కళ్యాణ్‌ సినిమా అయినా ఆ రేంజ్ కంటెంట్ లేదు అన్నారు ఆడియన్స్. అందుకే కలెక్షన్స్ కూడా ఆశించినంత గొప్పగా లేవు. పవన్ కళ్యాణ్‌ సినిమా ఉంది కదా అని ఆ తర్వాతి రోజు స్లమ్ డాగ్ హస్బండ్, సాక్షి, ఒక్కరోజు 48 గంటలు అనే చిత్రాలు వచ్చాయి. బట్ ఈ సినిమాలున్న సంగతి కూడా చాలామంది ఆడియన్స్ కు తెలియదు.


సో టాలీవుడ్ సెకండ్ హాఫ్‌ ఏమంత స్ట్రాంగ్ గా మొదలు కాలేదు. బేబీ మాత్రమే బ్లాక్ బస్టర్. బ్రో హిట్ అంతే. అయితే ఆగస్ట్ లో భారీ సినిమాలున్నాయి. అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా సెప్టెంబర్ నుంచి అన్నీ ప్యాన్ ఇండియన్ సినిమాలే రాబోతున్నాయి. మరి ఇవైనా టాలీవుడ్ కు బెస్ట్ రిజల్ట్ ఇస్తాయేమో చూడాలి. ఇప్పటికైతే జూలై రిజల్ట్ డల్ అనే చెప్పాలి.

Related Posts