వస్తున్నవాడు అశ్విన్ బాబు

అశ్విన్ బాబు.. యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తమ్ముడుగా పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో ఒక్కో అడుగూ వేస్తూ వస్తున్నాడు. జీనియస్ అనే సినిమాతో నటుడుగా పరిచయం అయ్యాడు. తర్వాత తన అన్న డైరెక్ట్ చేసిన రాజుగారి గది చిత్రంతో హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్నాడు. అంతకు ముందు చేసిన జత కలిసే సినిమా సైతం ఆకట్టుకునేలా ఉంటుంది. నాన్నా నేను నా బాయ్ ఫ్రెండ్స్, రాజు గారి గది 2,3 సినిమాలు యావరేజ్ అనిపించుకున్నాయి.

బట్ రీసెంట్ గా వచ్చిన హిడింబ మూవీతో మెప్పించాడు. ఈ చిత్రం కోసం కొత్త మేకోవర్ తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. సినిమాలో అతని పాత్ర కూడా సర్ ప్రైజింగ్ గానే ఉంటుంది. కమర్షియల్ గా హిడింబ హిట్ అనే చెప్పాలి. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. అయితే ఇకపై గ్యాప్ లేకుండా చూసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందులో భాగంగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

ఇవాళ అశ్విన్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఆ మూవీ టైటిల్ “వచ్చినవాడు గౌతం”.
రక్తం కారుతున్న చేతలతో స్టెతస్కోప్ పట్టుకుని ఉన్న ఈ స్టిల్ బావుంది. టైటిల్ సైతం పవర్ ఫుల్ గానే ఉంది. ఈస్టిల్ ను బట్టి అతను ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడని.. అర్థం అవుతోంది.

దీంతో పాటు అవసరమైతే దేనికైనా సిద్ధం అనేలా ఉన్నాడు. షన్ముఖ పిక్చర్స్ బ్యానర్ లో అల్లూరి హర్షవర్ధన్ చౌదరి సమర్పిస్తోన్న ఈ చిత్రానికి మామిడాల ఎమ్ఆర్ కృష్ణ దర్శకడు. అల్లూరి సురేష్ నిర్మాత. హిడింబతో హిట్ అందుకున్న అశ్విన్ ఆ ట్రాక్ ను కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి. దానికంటే ముందు అశ్విన్ కు బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.

Related Posts