మర్డర్ ఇన్వెస్టిగేషన్స్ లో టాలీవుడ్

టాలీవుడ్ లో హత్యలు పెరుగుతున్నాయి. వాటి ఇన్వెస్టిగేషన్స్ కోసం హీరోలు పెరుగుతున్నారు. మామూలుగా ఈ తరహా సీన్స్ ఎప్పుడో కానీ కనిపించవు. బట్ ఈ వారం మాత్రం ఏకంగా మూడు సినిమాలు అదే కంటెంట్ తో వస్తున్నాయి. వీటిలో ఆల్రెడీ హిడింబ ఈ రోజే విడుదలైంది.

ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా నటించిన ఈ సినిమా కూడా మర్డర్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలోనే సాగుతుంది.ఈ సినిమాలో విపరీతమైన బ్లడ్ షెడ్ ఉంది. అనేక కిడ్నాప్ లు, హత్యలు, క్రూరమైన రక్తపాతం కనిపిస్తాయి. వాటి వెనక ఉన్నది ఎవరా అని హీరో, హీరోయిన్లు సాగించే అన్వేషణ ఆ నేపథ్యంలో వచ్చే థ్రిల్ ఈ కథ.


ఇక నెక్ట్స్ వస్తున్నది ‘హర్’.రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం రెండుచాప్టర్స్ గా వస్తోంది.ఇది ఫస్ట్ చాప్టర్ అంటున్నారు. ఇది కూడా మర్డర్ మిస్టరీ నేపథ్యలో వస్తోన్న సినిమానే. ‘చి.ల.సౌ’ సినిమాతో ఆకట్టుకున్న రుహానీ వర్మ ఆతర్వాత పెద్ద విజయాలు చూడలేదు. ఈ మూవీ ట్రైలర్ కాస్త ప్రామిసింగ్ గానే ఉంది.ఇందులో ఆమె పోలీస్ఆఫీసర్ గా నటించింది. మరి ఈ మిస్టీరియస్ మూవీ ఆడియన్స ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో..


వీటితో పాటు వస్తోన్న మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘హత్య’. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన ఈ తమిళ చిత్రాన్ని ఎప్పట్లానే తెలుగులో డబ్ చేశారు. మీనాక్ష చౌదరి, గురు ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్ ఆకట్టుకునేలానే ఉంది. విజయ్, రితిక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ గా నటించారు. హత్యకు గురయ్యేది సినిమాలో పెద్ద నటి అయిన మీనాక్షి పాత్ర.


ఇక మర్డర్ మిస్టరీ అని చెప్పలేం కానీ.. ఓ ఆత్మహత్య చుట్టూ తిరిగే కథతోనే అన్నపూర్ణ ఫోటో స్టూడియో వస్తుంది. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఉండదు కానీ.. కాస్త థ్రిల్లర్ మోడ్ లో సాగుతుంది.
మొత్తంగా ఈ వారం సినిమాల్లో హిడింబ, హర్, హత్య మూడూ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సినిమాలే కావడం విశేషం. మరి ఈ మూడింటిలో ఎవరి ఇన్వెస్టిగేషన్ కు ఆడియన్స్ ఎక్కువ ఓట్లు వేస్తారో చూడాలి.

Related Posts