డ్రగ్స్ దందాలో టాలీవుడ్ బ్యూటీస్

కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ ను డ్రగ్స్ దందా షేక్ చేసింది. వరుసగా బిగ్ స్టార్స్ అందరినీ ఈ కేస్ లో ఇరికించారు. రోజులు నెలల తరబడి వారిని విచారించారు. బట్ ఏ ఉపయోగం లేదు. వారి నుంచి సరైన ఆధారాలు రాబట్టలేకపోయారు. ఆ కేస్ కొట్టివేశారు అని చెప్పలేం.

బట్ ప్రస్తుతానికి అంతా సద్దుమణిగింది అనుకుంటోన్న తరుణంలో మరోసారి టాలీవుడ్ ఉలిక్కిపడేలా చేసింది డ్రగ్స్ దందా. ఇంతకు ముందు తమిళ కబాలి చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి కొన్నాళ్లుగా ఈ దందాకు తెరలేపాడు. అతన్ని కొన్ని రోజుల క్రితమే పోలీస్ లు అరెస్ట్ చేశారు. విచారణలో కేపీ ఖాతాలో టాలీవుడ్ కు చెందిన వారు కూడా ఉన్నారని తేల్చారు.


వీరిలో బిగ్ బాస్,రామ్ గోపాల్ వర్మ ఫేమ్ అషురెడ్డి తో పాటు వ్యాంప్ క్యారెక్టర్స్ చేసే జ్యోతిరెడ్డి, సురేఖావాణి, తదితరులు ఉన్నారు. అయితే వీరంతా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ఇంకా తెలియదు కానీ.. కేపీ చౌదరి నిర్వహించే పార్టీలకు వీళ్లు తరచూ హాజరయ్యేవారు అని పోలీస్ లు తేల్చారు. హైదరాబాద్ లోనే అతని కస్టమర్స్ కు నిత్యం పార్టీలు ఇస్తుండేవాడని తేలింది. ఈ పార్టీల్లోనే డ్రగ్స్ విపరీతంగా వాడినట్టు పోలీస్ లు గుర్తించారు. టాలీవుడ్ కు చెందిన వీరిలో కేపీ చౌదరి రెగ్యులర్ గా అషురెడ్డితో మాట్లాడేవాడని గుర్తించారు పోలీస్ లు. ఇంకా అతని ద్వారా టాలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖులు డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టుగా సమాచారం.

ఆ దిశగా ఇంకా పోలీస్ ల దర్యాప్తు సాగుతోంది. అయితే తన వద్ద ఎవరెవరు ఎప్పుడెప్పుడు డ్రగ్స్ తీసుకున్నారు అనే సమాచారాన్ని అతను ఓ పెన్ డ్రైవ్ లో పొందు పరిచాడట. ఆ వివరాలన్నీ బయటకు వస్తే ఇంకా ఎంతమంది విషయాలు బయటకు వస్తాయో తెలుస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారంలో అందరికంటే ఎక్కువ హైలెట్ అవుతోంది అషురెడ్డి మాత్రమే. తనే కేపీ చౌదరితో నిరంతరం ఫోన్ టచ్ లో ఉండేదట. అంటే తను వాడుతుందా లేక తనూ ఓ డ్రగ్ పెడ్లర్(అమ్మకం చేయడం) గా మారి టాలీవుడ్ లో ఇంకా కొంతమందికి సరఫరాల చేస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.


సోషల్ మీడియా ద్వారా కొంత పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ తో కొంత ఎక్కువమందికి తెలిసింది. ఇంకా చాలామందికి తెలిసింది మాత్రం దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ వల్ల. ఈ ఇంటర్వ్యూలో వర్మ ఆమె పాదాలను కొరుకుతూ చేసిన వ్యాఖ్యలు అప్పుడు వైరల్ గా మారాయి.

Related Posts