HomeMoviesటాలీవుడ్'టిల్లు స్క్వేర్' రిలీజ్ ట్రైలర్.. లిల్లీతో టిల్లు లొల్లి

‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ ట్రైలర్.. లిల్లీతో టిల్లు లొల్లి

-

పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డీజే టిల్లు’ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో టిల్లుగా ఆన్ స్క్రీన్ పై అమాయకత్వంతో కూడిన క్యారెక్టరైజేషన్, స్టైల్, రొమాన్స్.. అన్నింటిలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నాడు స్టార్ బాయ్ సిద్ధు. ఇప్పుడు ‘డీజే టిల్లు’కి మిన్నగా డబుల్ డోస్ ఫన్, రొమాన్స్ పంచడానికి ‘టిల్లు స్క్వేర్’తో వస్తున్నాడు.

అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రేపు (మార్చి 29న) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘టిల్లు స్క్వేర్’ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ ట్రైలర్ రిలీజయ్యింది.

మొదటి భాగంలో రాధిక వల్ల ఇబ్బందులు పడ్డ టిల్లు.. సీక్వెల్ లో లిల్లీతో ఎలాంటి లొల్లి వచ్చిందన్నదే ఈ రిలీజ్ ట్రైలర్ లో చూపించారు. ఇక.. ‘డీజే టిల్లు’ తరహాలోనే వినోదాత్మకంగా, టిల్లు శైలి సంభాషణలతో సీక్వెల్ కూడా సాగనుందని రిలీజ్ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధుకి దీటైన పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతుంది. ఇప్పటివరకూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో మెరిసిన అనుపమ.. ఈ మూవీలో తన బోల్డ్ అవతార్ ని ఆవిష్కరించబోతుంది.

రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరపరిచిన పాటలు ఇప్పటికే విడుదలై చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

ఇవీ చదవండి

English News