ఖుషీని కొట్టే రేంజ్ లో తొలిప్రేమ

రీ రిలీజ్ ల ట్రెండ్ మొదలైన తర్వాత వరుసగా ఒక్కో హీరో పాత సినిమాలను కొత్త టెక్నాలజీకి మిక్స్ చేసి వదులుతున్నారు. పవన్ కళ్యాణ్‌ ఖుషీ, మహేష్‌ బాబు ఒక్కడు, ఎన్టీఆర్ సింహాద్రి మూవీస్ మంచి కలెక్షన్స్ సాధించాయి. అయితే వీటిలో టాప్ ప్లేస్ లో ఉంది ఖుషీ.

తర్వాత సింహాద్రి, ఒక్కడు చిత్రాలున్నాయి. నిజానికి ఖుషీ రికార్డ్ ను సింహాద్రి కొట్టేస్తుందనుకున్నారు చాలామంది. కొద్దిలో మిస్ అయింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ దే మరో సినిమా తొలిప్రేమ వస్తోంది. ఈ నెల 30న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 275కు పైగా థియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి.

సంధ్య థియేటర్లో అయితే మార్నింగ్ 8ఏఎమ్ షో టికెట్స్ ఎప్పుడో అయిపోయాయి. దాదాపు అన్ని థియేటర్స్ దగ్గరా ఇదే పరిస్థితి ఉంది. అంటే పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీకి ఇంకా అదే క్రేజ్ ఉందన్నమాట.
ఓ రకంగా పాత సినిమాలకు ఈ రేంజ్ క్రేజ్ ఉండటం ఆశ్చర్యమే.

ఇప్పటికే ఈ సినిమాలను థియేటర్స్ తర్వాత డివిడిలు, సిడిలు, యూ ట్యూబ్, టివిలు అంటూ అన్ని ఫార్మాట్స్ లోనూ చూసి ఉంటారు ప్రేక్షకులు. అయినా మళ్లీ అదే స్థాయిలో.. ఏదో ఫస్ట్ టైమ్ థియేటర్స్ లో విడుదలవుతున్నంత ఉత్సాహంగా బుకింగ్స్ అవుతున్నాయంటే కారణం ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ తో పాటు.. ఆయా మూవీస్ తో ఫ్యాన్స్ కు ఉన్న ఎమోషనల్ బాండింగే కారణం.


తొలిప్రేమ లాంటి సినిమాలకు ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ లవ్ అనే ఫీలింగ్ అన్ని జెనరేషన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మొబైల్స్, గాడ్జెట్స్ అంటూ ఎన్ని ఉన్నా.. ప్రతి మనిషికీ హృదయం మారదు.. దాని స్పందనా మారదు. ముఖ్యంగా తొలిప్రేమ అనే భావన లేని తరం ఉండదు. అందుకే ఈ తరాన్ని కూడా ఈ మూవీ మరింతగా మెప్పించే అవకాశాలున్నాయి. అందువల్లే ఖుషీ మూవీ సాధించిన కలెక్షన్స్ రికార్డ్ ను తొలిప్రేమ కొట్టేస్తుందని భావిస్తున్నారు చాలామంది.

Related Posts