భాగ్ సాలే ట్రైలర్.. భలే ఉందే ..

భాగ్ సాలే.. శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన సినిమా. రీసెంట్ గా సిద్దు జొన్నలగడ్డ వాయిస్ లో చెప్పించిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.

టైటిల్ కు తగ్గట్టుగానే ఇదో ఛేజీ కామెడీ సినిమాలా కనిపిస్తోంది. ట్రైలర్ మొత్తం ఎంటర్టైనింగ్ గానే ఉంది. గతంలో టీజర్ లో చెప్పినట్టుగా.. నిజాం రాజు వద్ద ఉన్న షాలీ షుకా గజా అనే ఉంగరం కొట్టేసిన ఫ్యామిలీకి చెందిన హీరోను అన్వేషిస్తూ వస్తాడు విలన్. కానీ ఆ ఉంగరం గురించి తెలియని ఈ రాయల్ ఫ్యామిలీ హీరో మాత్రం ఆ విలన్ చేతిలో నానా ఇబ్బందులూ పడుతుంటాడు.

దీనికి తోడు తను రాయల్ ఫ్యామిలీ అని చెప్పినందుకు తనను ప్రేమించిన హీరోయిన్ ఫాదర్ ముందు తేలిపోతాడు. అంతా రాయల్ ఫ్యామిలీ అనుకుంటుంటే అతను మాత్రం చెఫ్ గా లైఫ్‌ ను లీడ్ చేస్తుంటాడు. ఇక ఎప్పుడైతే రింగ్ కోసం విలన్ ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి ఈ హీరోగారి జీవితంలో పరుగులు మొదలవుతాయి. మరి ఈ పరుగులు ఏ తీరం చేరాయి. ఈ షాలీ షుకా గజా అంటే ఏంటీ..? అనేది అసలు కథ అని ట్రైలర్ తో తెలిసిపోతుంది.


అయితే ట్రైలర్ ను మాత్రం హిలేరియస్ గా కట్ చేశారనే చెప్పాలి. అక్కడక్కడా కాస్త డబుల్ మీనింగ్ డైలాగులున్నా.. ఇప్పుడున్న ట్రెండ్ లో వర్కవుట్ అయ్యేలానే ఉన్నాయి. హీరోయిన్ .. హీరోను నేనంటే ఎంతిష్టం అని అడిగితే.. “కేసీఆర్ కు తెలంగాణ అంటే ఎంతిష్టం అంతిష్టం..” అనే డైలాగ్ బలే ఉంది.

“రింగ్ అక్కడ పెట్టుకోరు..”, “వీణపోయి కింగ్ ఏడుస్తుంటే.. ఉంచుకున్నదొచ్చి రింగ్ అడిగిందట.. “, “ఇట్స్ ఆల్ ఎబౌట్ లోడింగ్ అన్ లోడింగ్” అనే డైలాగ్స్ ట్రైలర్ బాగా పేలాయి. మొత్తంగా టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా అంతా మంచి కామెడీ ఛేజింగ్ లు ఉండేలా కనిపిస్తోంది. నిన్నటి వరకూ ఈ మూవీపై ఏ మాత్రం కనిపించని అంచనాలు ట్రైలర్ తో మొదలవుతాయి అనే ఉంది.