ఈ గెలుపు రాముడిదా, ప్రభాస్ దా

ఆదిపురుష్‌ … భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా. ఈ శుక్రవారం విడుదలైన ఆదిపురుష్ కు అన్ని ఏరియాస్ నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. అస్సలే మాత్రం బాగా తీయలేదు అంటూ అభిమానులు కూడా విమర్శలు చేశారు.

విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ దారుణంగా ఉన్నాయి. రామ, రావణ పాత్రలను సరిగా డిజైన చేయలేదు. ముఖ్యంగా రావణ పాత్రను తీర్చి దిద్దిన విధానం అస్సలు బాలేదు అన్నారు. అయినా ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ సాధించిందీ చిత్రం. ఏకంగా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది అంటూ చెబుతున్నారు మేకర్స్.

ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఈ కలెక్షన్స్ తో ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ సాధించాడు. వరుసగా మూడు సినిమాలతో వందకోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఏకైక హీరోగా అవతరించాడు. అయితే ఆదిపురుష్‌ కలెక్షన్స్ మాత్రం మొదటి రోజుగా ఇప్పట్లో ఎవరూ అందుకోలేనివిగా కనిపిస్తున్నాయి.

మరి ఈ గెలుపు ప్రభాస్ ఖాతాలోనే వేయాలా లేక రాముడి అకౌంట్ లో వేయాలా..?
ఆదిపురుష్ లో రాముడుగా ప్రభాస్ పెద్దగా నప్పలేదు అనే విమర్శలుమొదటి నుంచీ ఉన్నాయి. ఆయన గెటప్ కూడా ఏమంత ఆకట్టుకోలేదు. ముఖ్యంగా దక్షిణాది ప్రేక్షకులకు నచ్చలేదు కూడా. మనకు రాముడు అంటే ఉంటే ఊహ వేరే.

దానికి దగ్గరలో కూడా ప్రభాస్ లుక్ లేదు. పోనీ మోడ్రన్ రామాయణం తీశారా అంటే కాదు. అదే కథ. ఆ కథలో చేయాల్సినంత డామేజ్ లు చేశారు. ఏ పాత్రకూ సరైన ఔచిత్యం లేదు. పాత్రల మధ్య కనెక్షన్ కూడా హానెస్ట్ గా కనిపించలేదు అనే విమర్శలు వచ్చాయి.

అయినా మొదటి రోజు ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేసిన ఘనతను ఎవరి ఖాతాలో వేయాలి అంటే ఖచ్చితంగా రాముడి ఖాతాలోనే పడతాయి. ప్రస్తుతం ఈ తరహా చిత్రాలకు దేశంలో ఓ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఆదిపురుష్ కూ వర్కవుట్ అయింది. కాకపోతే ఈ మూవీలో ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఉన్నాడు కాబట్టి చాలా చాలా ఎక్కువగా వర్కవుట్ అయింది. అంతే తప్ప.. పూర్తిగా ప్రభాస్ వల్లే ఈ క్రేజ్ సాధ్యం అయిందీ అంటే రాముడిని అవమానించినట్టే అవుతుంది.

రాముడు .. జై శ్రీరామ్ నినాదాలు ఇప్పుడు ఇండియాలో స్వాతంత్ర్యానికి ముందు వందే మాతరం నినాదం రేంజ్ లో మార్చారు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూశారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ బుకింగ్స్ తోనూ సత్తా చాటడం వల్ల ఫస్ట్ డే కలెక్షన్స్ లో రికార్డులు సాధ్యం అయ్యాయి.


ఇక ఖచ్చితంగా చెబితే ఈ క్రెడిట్ లో రాముడి వాటా 75 శాతం ఉంటే.. మిగతాది ప్రభాస్ తో పాటు దర్శకుడిదీ ఉంటుంది. ఎందుకంటే రామాయణంలో మార్పులు లేవు. కానీ వీరు తీసిన ఆదిపురుష్ లో ఉన్నాయి. వక్రీకరణలే కాదు. పాత్రలను తీర్చి దిద్దడంలో వక్రబుద్ధలు కూడా కనిపించాయి.

అందుకే వీరి ఖాతాలో తక్కువ శాతం పడుతుంది. రాముడేమీ తన గాథను ఇలా తీయాలని చెప్పలేదు కదా..? అంచేత విమర్శలన్నిటికీ కారణం దర్శకుడు, మేకర్స్ అవుతారు తప్ప రామాయణం కాదు. సో.. ఈ కలెక్షన్స్ కు కారణం కూడా రామాయణమూ.. రాముడూ తప్ప మరోటి కాదు అంటే అతిశయోక్తి కాదేమో..?

Related Posts