నాకూ పెళ్లి కావాలి

నాకూ పెళ్లి కావాలి.. అంటోంది బాలీవుడ్ కాట్రవర్శీయల్ క్వీన్ కంగనా రనౌత్. బాలీవుడ్ లో తనంతటి ఆర్టిస్ట్ లే(డ)దని తెగ ఫీలయ్యే ఈ బ్యూటీ అక్కడి రిలేషన్స్ పై ఓపెన్ గానే విమర్శలు చేస్తుంది. బాలీవుడ్ వారి ప్రేమలంటే తనకు చిరాకు అని ఎన్నోసార్లు చెప్పింది.

పైగా అవన్నీ అవసరాల కోసం అడ్డదారులు తొక్కే వ్యవహారాలు అని కూడా చెబుతూ వస్తుండేది. ఇక ఈ దేశంలో మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తర్వాత అంతటి దేశభక్తురాలు కూడా తనే అని ఫీలయ్యే కంగనా కళ్యాణ ఘడియలు కావాలి అంటోంది.

అయినా అమ్మడు తలచుకుంటే వరుడు దొరకడం అంత కష్టమా. మరి ఆ కాబోయే వాడు ఎవరో కానీ లేటెస్ట్ గా తను నటించిన ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి గురించి అడిగిన మీడియాకు ఈ సమాధానం చెప్పి ఆశ్చర్యపరిచిందీ క్వీన్.


కొన్నాళ్ల క్రితం తను ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పింది కంగనా. మరి ఆ షిప్ ఉందా మునిగిందా అనేది తెలియదు కానీ.. ప్రస్తుతం తనకూ పెళ్లి చేసుకోవాలి అనిపిస్తోందంటూ చెబుతోంది. ఈ పెళ్లి గురించిన మాట నిజమా లేక ప్రమోషన్స్ లో భాగమా అనేది అప్పుడే చెప్పలేం కానీ ప్రస్తుతం తను టీకూ వెడ్స్ షేరూ అనే చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తోంది.

మరోవైపు ఇందిరా గాంధీ బయోపిక్ లో నటిస్తూ తనే నిర్మించి దర్శకత్వం వహించింది. కానీ ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా అని గతంలో చెప్పింది. ఏదేమైనా ఈ కాంట్రవర్శీయల్ క్వీన్ తో కాపురం చేసే ఆ లక్కీ ఫెలో ఎవరో మరి.

Related Posts