వారం వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. పోయిన వారం థియేటర్లలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయు వేగం, గం గం గణేశా’ వంటి మూడు సినిమాలొచ్చాయి. ఇక.. ఈ వారం నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవే.. ‘మనమే, సత్యభామ, లవ్ మౌళి, రక్షణ’.
ముందు నుంచీ ప్రచారంలో లేకపోయినా సడెన్ గా జూన్ 7న విడుదల తేదీ ఖరారు చేసుకున్న చిత్రం ‘మనమే’. శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఆద్యంతం యూరప్ బ్యాక్‌డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడట డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా కృతి శెట్టి నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీకి హేషబ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని సమకూర్చాడు. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’, మహేష్ బాబు ‘మురారి’ తరహాలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ‘మనమే’ ఆకట్టుకుంటుందని చెబుతోంది చిత్రబృందం.
ఈ వారం వస్తోన్న చిత్రాలలో కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ ఒకటి. కాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన చిత్రమిది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో మరో దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాని నిర్మించడం విశేషం. ఇప్పటికే ‘సత్యభామ’ కోసం కాజల్ ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ నిర్వహించింది. ఈ సినిమా ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ విడుదల చేశారు. ఇక.. ఈవారం శర్వానంద్ ‘మనమే’తో పాటు ‘సత్యభామ’ కూడా హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోంది.
కాస్త గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా నటించిన చిత్రం ‘లవ్ మౌళి’. అసలు ఏప్రిల్ 19నే విడుదలవ్వాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. జూన్ 7న ‘లవ్ మౌళి’ థియేటర్లలోకి వస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో C స్పేస్, నైరా క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవదీప్ ఇప్పటివరకూ చేయనటువంటి ఓ ప్రయోగాత్మకమైన పాత్రను ఈ చిత్రంలో చేశాడట. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీకి గోవింద్ వసంత సంగీతాన్ని సమకూర్చాడు.
కాజల్ ‘సత్యభామ’ తరహాలోనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రతో.. లేడీ ఓరియెంటెడ్ గా రాబోతున్న మరో మూవీ ‘రక్షణ’. పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో నటించింది. హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా గురించి పాయల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే.. ఈ సినిమా ప్రచారానికి పాయల్ రావడం లేదని నిర్మాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి వెళ్లడం జరిగింది. ఎట్టకేలకు ఈ సినిమాని జూన్ 7న విడుదల చేస్తున్నారు.
అగ్ర కథానాయకులతో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలను తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై తీస్తున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.…
Surya, who is normal on other days, gets agitated on Saturday. We have already seen…
Sensational Kannada director Prashanth Neel.. has currently lined up two projects. One of them is…
Satyadev is making a distinction for himself among the new heroes. Satyadev, who strives for…
మిగతా రోజుల్లో మామూలుగా ఉండే సూర్య.. శనివారం మాత్రం రెచ్చిపోతుంటాడు. ఇప్పటికే ‘సరిపోదా శనివారం‘ చిత్రంలో సూర్య పాత్రలో నాని…
కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు. వాటిలో ఒకటి ప్రభాస్ ‘సలార్…