‘సిద్దార్ధ్ రాయ్‌ ‘ అసలు కారణం ఇదే : హీరో దీపక్‌ సరోజ్‌

చైల్డ్ ఆర్టిస్ట్‌నుంచి హీరోగా టర్న్‌ అయిన ఆర్టిస్ట్ దీపక్‌ సరోజ్‌. సిద్దార్ధ్ రాయ్‌ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.యశస్వి డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో దీపక్ సరోజ్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌ గా ఎన్నో సినిమాలు చేసిన దీపక్‌ సరోజ్‌… మాట్లాడుతూ.. మిణుగురులు చిత్రంతో నంది అవార్డ్ అందుకున్నాననీ. ఎంబీఏ పూర్తయిన తరవాత ఫ్యామిలీ బిజెనెస్‌ చేసుకుంటూ యశస్వీ కథ చెప్పడంతో సినిమా పట్ల ఆసక్తి పెరిగిందన్నారు. ఈ సినిమా కథ విన్నాక ఇలాంటి పాత్ర చేయగలనా అనే భయం ఏర్పడిందన్నారు.


సిద్దార్ధ్‌ రాయ్‌ పాత్రలో చాలా లాజికల్ ఎక్స్‌ట్రీమిజం ఉంటుంది. ఇలాంటి యాటిట్యూడ్‌ ప్రాక్టీస్ చేయడానికి చాలా టైమ్‌ పట్టిందన్నారు.అందులో భాగంగా ఫిలాసఫీ చదివాననీ.. ఓ రెండు నెలల పాట స్టెబిలిటీ వచ్చినా మళ్లీ పోయిందన్నారు. ఎమోషనల్‌గా అవడం, కంట్రోల్‌ లో ఉండటం అనేది పాత్ర పరిధిని బట్టి ఉంటుందన్నారు. ఇలాంటి క్యారెక్టర్ పర్‌ఫెక్ట్‌గా చేయగలనా లేదా అని భయపడ్డానన్నారు.
సిద్దార్ధ్ రాయ్‌ లో అర్జున్‌ రెడ్డి పోలికలు కనిపించాయనేవాళ్లకు సమాధానంగా.. అర్జున్‌ రెడ్డి సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి లింక్ లేదన్నారు. సినిమా చూస్తున్న పదినిమిషాలకే ఆడియెన్స్‌ సిద్దార్ధ్ రాయ్‌ కథలో లీనమైపోతారన్నారు.


సిద్దార్ధ్ అనేది రివర్స్‌ థీసెస్ ఆఫ్‌ గౌతమ బుద్ద.. అందుకే దర్శకుడు యశస్వి ఈ కథ స్క్రీన్‌ప్లే చాలా బలంగా రాసారన్నారు.
సామాజిక భాద్యతతోనే ఈ క్యారెక్టర్ ని డీల్ చేశాం. తను అలా మారడానికి, ప్రవర్తించడానికి మూలం ఎక్కడ మొదలైయింది ? అది ఎలా రూపాంతరం చెందిందనేది చూపించబోతున్నామన్నారు.
ది రెగ్యులర్ స్టొరీ, హోమ్లీ క్యారెక్టర్ కాదు. దర్శకుడు కొందరిని సంప్రదించినప్పటికీ కుదరలేదు. ఫైనల్ గా కెమరా ఎక్స్పోజర్ వున్న చైల్డ్ ఆర్టిస్ట్ అయితే బావుటుందని బావించారు. అలా నన్ను సంప్రదించారు. ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ పాత్ర చేశానన్నారు. సిద్ధార్థ్ రాయ్ లో ప్రధాన సంఘర్షణ తను నమ్మి ఫిలాసఫీ, నమ్మకం పైన వుంటుంది. అది చాలా యూనిక్ చూపించామన్నారు.
డైరెక్టర్ యశస్వి గట్స్‌తో కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా తీసారన్నారు.
కొత్తగా చేయబోయే సినిమాల గురించి చెప్తూ.. రెండు సినిమాలు చేయబోతున్నాను. మార్చి, జూన్ లో మొదలౌతాయి. ఇవి ఫ్యామిలీ ఎంటర్ ఎంటర్ టైనర్స్ అన్నారు దీపక్‌ సరోజ్‌.

Related Posts