తండ్రిగా ప్రమోట్ అయిన నిఖిల్‌

హ్యాపీడేస్‌ తో సాదాసీదా సెకండ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. కామెడీ సినిమాలతో నిలదొక్కుకుని ఎక్కడికి పోతావు చిన్నవాడా, సూర్య వర్సెస్ సూర్య లాంటి ఎక్స్‌పరిమెంట్స్ చేస్తూ.. అర్జున్‌ సురవరం లాంటి ఇంటెన్స్‌ సబ్జెక్ట్‌తో మెయిన్‌ స్ట్రీమ్‌ హీరోల కేటగిరీలో చేరిన నిఖిల్‌.. కార్తికేయ సినిమాతో వండర్స్ బ్లాక్‌బస్టర్ హీరోగా మారాడు. ఇప్పుడు కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరో అయ్యాడు నిఖిల్‌. రీల్‌ లైఫ్‌ లో ఇన్నిసార్లు ప్రమోట్‌ అయిన నిఖిల్… ఇప్పుడు రియల్‌ లైఫ్‌లో ముఖ్యమైన పొజిషన్‌ కి ప్రమోట్ అయ్యాడు. నిఖిల్ ఇప్పుడు తండ్రిగా ప్రమోట్‌ అయ్యాడు.


నిఖిల్‌ సిద్దార్ధ్, డాక్టర్‌ పల్లవి వర్మలు 2020 లో వివాహం చేసుకున్నారు. రీసెంట్‌గా ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పల్లవి వర్మ పండంటి బాబుకు జన్మనిచ్చారు. బాబును చూసుకుని మురిసిపోయాడు పాన్ ఇండియా హీరో నిఖిల్‌. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. నిఖిల్ అభిమానులు,స్నేహితులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నిఖిల్‌ ప్రస్తుతం స్వయంభూలో నటిస్తుండగా.. ది ఇండియా హౌజ్‌, కార్తికేయ 3 లు క్యూలో ఉన్నాయి.

Related Posts