ఇంప్రెసివ్ గా మంత్ ఆఫ్‌ మధు ట్రైలర్

నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించిన సినిమా మంత్ ఆఫ్‌ మధు. గతంలో నవీన్ చంద్రతో భానుమతి రామకృష్ణ అనే చిత్రం రూపొందించిన శ్రీనివాస్ నాగోతి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. గతంలో విడులైన టీజర్ ఆకట్టుకుంది. నవీన్ చంద్ర, స్వాతి కలిసి గతంలో త్రిపుర అనే చిత్రంలో నటించారు. అది వర్కవుట్ కాలేదు. ఈ మూవీతో మరోసారి జోడీ కట్టారు.

లేటెస్ట్ గా ఈ మంత్ ఆఫ్ మధు ట్రైలర్ విడుదల చేశారు. నవీన్ చంద్ర ఎంత టాలెంటెడ్ యాక్టర్ అనేది అందరికీ తెలుసు. ఏ పాత్రైనా అదరగొడతాడు. మరోసారి అతనికి హీరోగా ‘నటించే’ అవకాశం వచ్చిందని ఈ ట్రైలర్ చూడగానే అనిపిస్తుంది. అఫ్ కోర్స్ స్వాతి సైతం అద్భుతమైన పాత్ర చేసిందని తెలుస్తోంది.


మంత్ ఆఫ్‌ మధు టీజర్ చూసినప్పుడు ఇది ఈ ఇద్దరికీ సంబంధించిన కథ అనుకున్నారు. బట్ దర్శకుడు ఇప్పటి వరకూ తెలుగు తెరపై ఎవరూ చేయని అటెంప్ట్ చేసినట్టుగా ట్రైలర్ తో అర్థమైంది. విదేశాల్లో పెరిగిన ఓ అమ్మాయి. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆ అలవాట్లు వదులుకోలేకపోతుంది. ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు ఎంత వారించినా వినదు. ఇంక పెళ్లి చేసుకోవాల్సిన టైమ్ లో తన ప్రవర్తన తెలిసి వాళ్లు వెళ్లిపోతారు. అటుపై తను ఇండియాలోనే ఉండాలనుకుంటుంది. ఆమె పేరు మధు. తను ఓ సారి ఈ మధు అలియాస్ మధుసూదన్ రావును కలుస్తుంది. మధుసూదన్ అప్పటికే భార్యతో విడిపోయి ఉంటాడు. ఆమె విడాకులుకు కోర్ట్ లో కేస్ వేస్తుంది. బట్ భర్తంటే చాలా ఇష్టం. అందుకే అతనితో విడిపోవాలనుకుంటుంది కానీ.. అంతా చెప్పినట్టుగా ” సెటిల్మెంట్” చేసుకోమంటే నో చెబుతుంది. అసలు వీరి మధ్య గొడవలకు కారణం ఏంటీ.. అమెరికా మధు వల్ల మధుసూదన్ రావు జీవితంలో వచ్చిన మార్పులేంటీ.. అనేది ప్రధాన కథలా కనిపిస్తోంది.


ఎలా చూసినా మంత్ ఆఫ్ మధు ట్రైలర్ వెరీ ఇంప్రెసివ్ గా ఉంది. డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నట్టు అర్థం అవుతోంది. ఓ మెచ్యూర్డ్ స్టోరీని మోడ్రన్ ఆడియన్స్ కు కూడా టచ్ అయ్యే కథనం ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అనేలా ఉంది. భానుమతి రామకృష్ణతో ఎంటైర్ ఇండస్ట్రీని మెప్పించిన దర్శకుడు శ్రీనివాస్ నాగోతి మరోసారి మెస్మరైజ్ చేస్తాడేమో చూడాలి. అన్నట్టు ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కాబోతోంది.

Related Posts