బేబీకి బంపర్ ఆఫర్

బేబీ సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన బ్యూటీ వైష్ణవి చైతన్య. ఈ మూవీ తర్వాత అమ్మడికి భారీ ఆఫర్స్ వస్తాయని చాలామంది భావించారు. కానీ అలా ఏం జరగలేదు. దీంతో తను కూడా అందరు తెలుగు హీరోయిన్లలాగే ఏ తమిళ్ లో వెళ్లిపోవాల్సిందేనా అనుకున్నారు.

బట్ కాస్త ఆలస్యం అయినా మెల్లగా పెద్ద ఆఫర్స్ అందుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ఓ రెండు ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది అనే వార్తలు వచ్చాయి. అవేంటనేది ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. వాటి గురించి ఏమో కానీ ఇప్పుడు ఓ ప్రామిసింగ్ బ్యానర్ లో ఆఫర్ కొట్టేసిందనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది.


తెలుగులో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో తక్కువ టైమ్ లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. హిట్టూ, ఫ్లాపులతో పనిలేకుండా వరుసగా సినిమాలు నిర్మిస్తూ.. మాగ్జిమం సక్సెస్ రేట్ అందుకున్న ఈ బ్యానర్ లోనే వైష్ణవి చైతన్య ఓ సినిమా చేయబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ ఫైనల్ అయింది.

హీరోయిన్ గా వైష్ణవి చైతన్యను ఆల్మోస్ట్ తీసుకున్నట్టే అంటున్నారు. ఈ ఆఫర్ తో వైష్ణవి చైతన్య కెరీర్ మరో టర్న్ తీసుకుంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజానికి ఈ బ్యూటీకి బేబీ తర్వాత ఆఫర్స్ వచ్చాయి. కానీ అవి కూడా బేబీ తరహా పాత్రలేనట.

అంటే ఎక్స్ పోజింగ్, కొన్ని లస్ట్ సీన్స్ తో నిండి ఉన్న కథలేనట. అందుకే తను నో చెప్పింది. ఆ విషయంలో తనను ముందు నుంచీ చాలామంది వార్న్ చేశారు కూడా. అలాంటి కథ మరొక్కటి చేస్తే ఇక కెరీర్ ఖతమ్ అయిపోతుందని. అవి ఫాలో అయ్యే మంచి కథల కోసం ఆగింది. మరి ఈ సితార బ్యానర్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు అంటున్నారు కదా. ఆ ప్రాజెక్ట్స్ తో తెలుగులో పాగా వేస్తుందా లేదా అనేది చూద్దాం.

Related Posts