టాలీవుడ్

ఇంప్రెసివ్ గా ”ఇంటింటి రామాయణం” ట్రైలర్

తెలంగాణ నేపథ్యంలో ఈ మధ్య చాలా కథలు వస్తున్నాయి. అన్ని కథల్లోనూ ఓ జెన్యూనిటీ కనిపిస్తోంది. కొన్ని మాత్రమే గాడి తప్పుతూ మందు, మాంసం అంటూ సాగుతున్నాయి. అయినా ఆ చిత్రాలు కూడ కమర్షియల్ గా ఆకట్టుకోవడం బాక్సాఫీస్ ను ఆశ్చర్యపరుస్తున్నాయి. బట్ కొన్ని మాత్రమే రియాలిటీకి దగ్గరగా కనిపిస్తున్నాయి. ఈ కథల్లో ఓ ఆత్మ ఉంటుంది.

అలాంటి కథే అనిపించేలా ఉంది ”ఇంటింటి రామాయణం” మూవీ. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చూస్తే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి జంటగా నరేష్, సురభి ప్రభావతి, గంగవ్వ, అంజి మామ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ కూడా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథలానే ఉంది.


ట్రైలర్ ను బట్టి చూస్తే.. నరేష్‌ కూతురుతో రాహుల్ రామకృష్ణ ప్రేమలో ఉంటాడు. ఈ విషయం వారి ఇళ్లల్లో తెలియదు. జనానికి మాత్ర రాహుల్ అమ్మాయిలంటే భయపడేవాడిలా కనిపిస్తాడు. పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం ఉండదు. ఈ క్రమంలోనే నరేష్ ఫ్యామిలీ కొన్ని రోజులు వేరే ఊరికి వెళుతుంది. దీంతో నరేష్ దోస్తులంతా కలిసి ఆ ఇంట్లో రోజూ దావత్ చేసుకుంటరు. ఈక్రమంలోనే ఇంట్లో బంగారం పోతుంది. మరి ఆ బంగారం దొంగిలించింది ఎవరు..? దీనికి ప్రేమకథకు ఏమైనా లింక్ ఉందా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమా రూపొందినట్టు అర్థమౌతోంది.

ఇక జమ్మికుంట పరిసర ప్రాంతానికి చెందిన గ్రామీణ కథగా వస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సమర్పిస్తుండగా వెంకట్ ఉప్పుటూరి – గోపీచంద్ ఇన్నమూరి నిర్మిస్తున్నారు. సురేష్‌ నరెడ్ల దర్శకుడు. మొత్తంగా తెలంగాణ నుంచి మరో ఇంట్రెస్టింగ్ డ్రామా వస్తున్నట్టుగా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

Telugu 70mm

Recent Posts

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

47 mins ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

1 hour ago

Only one song for the entire movie ‘Kalki’?

Among the crazy movies coming this year at pan India level is 'Kalki 2898 AD'.…

1 hour ago

‘Devara’ songs update from Ramajogayya Sastry

Not only the first song from 'Devara'.. the second song is also coming as a…

1 hour ago

Another aspect of TV actor Chandu’s life

Television actor Chandu's suicide has created a sensation. Serial actress Pavitra died in a car…

1 hour ago

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

3 hours ago