‘సలార్‘ ట్రైలర్ డేట్ వచ్చేసింది

సినీ ప్రియులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్‘. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి మామూలుగా లేదు. అయితే.. ఎట్టకేలకు ‘సలార్‘ ట్రైలర్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అనౌన్స్ చేయకపోయినా.. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ‘సలార్‘ ట్రైలర్ రిలీజ్ డేట్ పై హింట్ ఇచ్చాడు. డిసెంబర్ 1న ‘సలార్‘ ట్రైలర్ రాబోతుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

గతంలో ‘సలార్‘ పోస్ట్ పోన్ అవ్వబోతుందనే విషయాన్ని కూడా తరణ్ ఆదర్శ్ ముందుగా ప్రకటించాడు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ డేట్ పైనా అతనే క్లారిటీ ఇచ్చాడు. ఇక.. ఈసారి ఎలాంటి పోస్ట్ పోన్ లేకుండా డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా ‘సలార్‘ వచ్చేస్తుందని తన ట్వీట్ లో తెలిపాడు. మరోవైపు ‘సలార్‘లో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉంటుందట. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ పాటలో ‘డర్టీ హరి‘ ఫేమ్ సిమ్రత్ కౌర్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘కె.జి.యఫ్‘ తరహాలోనే ‘సలార్‘లో కూడా అమ్మ పాట హైలైట్ కానుందట. స్పెషల్ సాంగ్ తో పాటు అమ్మ పాటను కూడా రచయిత కె.కె. రాశాడట.

Related Posts