‘భారతీయుడు 3‘ కూడా రాబోతుంది

ఈమధ్య ఒకే కథను రెండు భాగాలుగా చెప్పే ఒరవడి బాగా జోరందుకుంది. దానికి ‘బాహుబలి‘ సిరీస్ ప్రేరణ అని చెప్పొచ్చు. అయితే.. కొన్ని సందర్భాల్లో తమ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రకటించకపోయినా.. కథా విస్తరణలో భాగంగా.. ఆయా సినిమాలను టూ పార్ట్స్ గా అనౌన్స్ చేస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంఫుల్ ‘దేవర‘. ఇక.. మొదటి భాగం విడుదలైన 27 ఏళ్ల తర్వాత సీక్వెల్ తో వస్తోన్న మూవీ ‘భారతీయుడు 2‘.

కమల్, శంకర్ కాంబోలో వస్తోన్న ‘భారతీయుడు 2‘ ఇంకా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నంలలో షెడ్యూల్స్ జరుగుతున్నాయి. ముందుగా ‘భారతీయుడు 2‘ ఒక భాగమే అనుకున్నారట.

అయితే.. ఇప్పుడు వచ్చిన అవుట్ పుట్ నిడివి భారీగా ఉండడంతో ఈ చిత్రానికి మరో భాగాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన కొంత భాగాన్ని.. ‘భారతీయుడు 2‘ విడుదలైన తర్వాత మరికొంత భాగాన్ని షూట్ చేసి.. మొత్తంగా ‘భారతీయుడు 3‘ని తీసుకురానున్నారట.

‘భారతీయుడు 3‘ ఉంటుందని స్వయంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన రెడ్ జయంట్ మూవీస్ అధినేత ఉదయనిధి స్టాలిన్ తెలిపాడు. ఇక.. ‘భారతీయుడు 2‘ విడుదల తేదీపైనా ఉదయనిధి స్టాలిన్ క్లారిటీ ఇచ్చాడు. వచ్చే యేడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.

Related Posts