శర్వానంద్ 35వ చిత్రానికి “మనమే” టైటిల్ ఖరారు

హ్యాండ్సమ్ హీరో శర్వానంద్ బర్త్డే స్పెషల్ గా ఈరోజు తన 35వ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కన్ఫర్మ్ చేసింది చిత్ర బృందం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వాకి జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి “మనమే” అనే ఆసక్తికర టైటిల్ను ఖరారు చేసింది టీమ్.

“మనమే” టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటే ఇది ఒక చైల్డ్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే చిత్రంగా అనిపిస్తుంది.
ఈ మధ్యకాలంలో తెలుగులో చైల్డ్ సెంటిమెంట్ నేపథ్యంలో వరుస చిత్రాలు వస్తున్నాయి. ఈ చిత్రానికి మలయాళీ మ్యూజికల్ సెన్సేషన్ హేషం అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts