‘వార్ 2’ కోసం రా ఏజెంట్ గా మారుతున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “దేవర” షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో “దేవర” బిజీగా ఉంది. అక్టోబర్ లో దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

“దేవర”తో పాటు బాలీవుడ్ మూవీ “వార్ 2” లోనూ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు తారక్. ఈ సినిమాలో యంగ్ టైగర్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

సిల్వర్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ విజువల్ ఫీస్ట్ అందించేలా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా “వార్ 2” తెరకెక్కుతుంది. ఇప్పటికే లీడ్ యాక్టర్స్ లేకుండా “వార్ 2” లోని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు డైరెక్టర్ అయన్ ముఖర్జీ. ఈ వారంలోనే హృతిక్ రోషన్ చిత్రీకరణలో పాల్గొంటాడట. జపాన్ లో హృతిక్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తాడట అయన్ ముఖర్జీ.

త్వరలోనే “వార్ 2” చిత్రీకరణలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్ గా కనిపించనున్నాడట. ఎన్టీఆర్ క్యారెక్టర్ ను ఇకముందు కూడా యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో కంటిన్యూ చేయనున్నారట. “వార్ 2” తర్వాత ఎన్టీఆర్ పోషించే రా ఏజెంట్ క్యారక్టర్ తో ఓ సోలో మూవీని ప్లాన్ చేస్తుందట యశ్ రాజ్ సంస్థ. మొత్తానికి “వార్ 2” లో ఎన్టీఆర్ క్యారక్టర్ అయితే సంథింగ్ స్పెషల్ గా నిలవబోతున్నట్టు బాలీవుడ్ టాక్.

Related Posts