‘హనుమాన్‘ నుంచి ‘రఘునందన‘ గీతం విడుదల

‘హనుమాన్‘ చిత్రం అఖండ విజయం సాధించడంలో కీలక భూమిక పోషించిన సాంకేతిక అంశాల్లో సంగీతాన్ని ప్రధానంగా చెప్పొచ్చు. ఈ సినిమాకోసం గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ వంటి ముగ్గురు సంగీత దర్శకులు పనిచేశారు. వీరు అందించిన సంగీతం ‘హనుమాన్‘ని మరో లెవెల్ లో నిలబెట్టింది. ముఖ్యంగా.. ఈ సినిమాలోని ‘రఘునందన రఘు రఘు నందన‘ గీతం సినిమా చూసిన ప్రేక్షకుల్ని దైవత్వంలో మునిగిపోయేలా చేసింది.

‘హనుమాన్‘కి డివోషనల్ టచ్ తీసుకొచ్చి ఈ సినిమా ఘన విజయం సాధించడంలో ‘రఘునందన రఘు రఘు నందన‘ కీలక పాత్ర పోషించింది. గౌరహరి అందించిన అద్భుతమైన ట్యూన్ కి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ ఎంతో పవర్ ఫుల్ గా కుదిరాయి. ఇక.. ఈ పాటను ఎంతో ఆధ్యాత్మికంగా ఆలపించారు సాయిచరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హర్షవర్ధన్ చావలి. తాజాగా.. ‘హనుమాన్‘ నుంచి ‘రఘునందన‘ సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం

Related Posts