‘కల్కి‘ విడుదలలో జాప్యం జరగనుందా?

సంక్రాంతి తర్వాత టాలీవుడ్ ప్రముఖంగా ఫోకస్ పెట్టే సీజన్ సమ్మర్. అసలు ఈ వేసవిలో ముందుగా బెర్త్ ఖరారు చేసుకున్న చిత్రం ‘దేవర‘. ఆద్యంతం సముద్రం నేపథ్యంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ మూవీ వేసవి బరి నుంచి తప్పుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమాని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. సమ్మర్ రేసు నుంచి ‘దేవర‘ తప్పుకోవడంతో.. ఈ ఏడాది టాలీవుడ్ కి వేసవి బరిలో ఆశాజ్యోతిలా కనిపిస్తున్న ఒకే ఒక్క చిత్రం ‘కల్కి‘.

‘సలార్‘ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ‘కల్కి‘. వైజయంతీ సంస్థ తమ 50 వసంతాల సినీ జర్నీకి అద్దం పట్టేలా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ కాన్సెప్ట్ తో ‘కల్కి‘ రూపొందుతోంది. అంతవరకూ బాగానే ఉంది. అయితే.. ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక, దిశా పఠాని వంటి భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ హై బడ్జెట్ మూవీ అనుకున్న సమయానికి వస్తోందా? లేదా? అన్నదే అందరినీ కలవరపెడుతోన్న ప్రశ్న.

‘కల్కి‘ చిత్రం ఒక పార్ట్ కాదు.. రెండు లేదా మూడు భాగాలుగా తీసుకొస్తారనే ప్రచారం ఉంది. దానిపైనా ఇంకా చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే.. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైందా? లేక ఇంకా.. ఎంత పెండింగ్ ఉంది అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా.. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ మూవీస్ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకే సంవత్సరాల తరబడి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. మరి.. ‘కల్కి‘ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఈ రెండు నెలల్లో కంప్లీట్ అవుతోందా? అనేది అనుమానమే

Related Posts