‘బేబి’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నుంచి వస్తోన్న మూవీ ‘గం గం గణేశా’. ఈ మూవీలో ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 31న ‘గం గం గణేశా’ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు నేషనల్ క్రష్ రష్మిక ముఖ్య అతిథిగా హాజరైంది.
ఈ ఈవెంట్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండపై రష్మిక చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వేడుకలో ఆనంద్ దేవరకొండ రష్మికను కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటిలో ‘మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరెట్?’ అనేది ఒకటి. దానికి సమాధానంగా ‘ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ ఇలా ఇరికిస్తే ఎలా? అంటూనే రౌడీ బాయ్ (విజయ్ దేవరకొండ) అని తెలిపింది’ రష్మిక.
ఇప్పటికే ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో రౌడీ స్టార్ విజయ్ తో కలిసి నటించిన రష్మిక.. ఇప్పుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించే సినిమాతో మూడోసారి అతనితో జోడీ కట్టబోతుంది. ప్రస్తుతం రష్మిక నటించిన ‘పుష్ప 2’ ఆగస్టులో విడుదలకు ముస్తాబవుతోంది.
ప్రభాస్ పట్టిందల్లా బంగారంలా మారుతుంది. రెబెల్ స్టార్ నుంచి సినిమా వస్తే.. కలెక్షన్ల సునామీ ఖాయం. అయితే.. ఒక సినిమా…
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే క్రేజీ సీక్వెల్స్ లో 'జై హనుమాన్' ఒకటి.…
'డార్లింగ్' ప్రభాస్ సినిమా టైటిల్ తో రూపొందుతోన్న ప్రియదర్శి చిత్రం 'డార్లింగ్'. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్…
The film 'Game Changer' is being made by global star Ram Charan and director Shankar.…
Even as it enters the tenth day, the 'Kalki' collections continue to flourish all over…
సినిమాల సంఖ్యా పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ, స్టార్ స్టేటస్ పరంగానూ, బిజినెస్ పరంగానూ ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా…