హై ఓల్టేజ్ తో వస్తోన్న గాండీవధారి

వరుస ఫ్లాపుల తర్వాత వరుణ్ తేజ్ నటించిన సినిమా గాండీవధారి అర్జున. ప్రవీణ్‌ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ప్రీ టీజర్ అంటూ ఒక వీడియో వదిలారు. ప్రవీణ్‌ సత్తారు మూవీస్ అంటే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా ఉంటాయని ఇప్పటికే ప్రూవ్ అయింది. ఇది కూడా ఆ తరహాలోనే వస్తోన్న సినిమానే అని ఈ ప్రీ టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

బ్యాడ్ బాయ్స్ డ్రైవ్స్ బ్యాడ్ టాయ్స్ అనే క్యాప్షన్ ఉన్న కాస్ట్ లీ కార్ ను అత్యంత వేగంగా నడుపుతూ వెళుతుంటాడు ఓ వ్యక్తి. ఆ కార్ లోనే అత్యంత అధునాతనమైన ఆయుధాలు ఉంటాయి. వాటిని తీసుకుని కదనరంగంలోకి అర్జునుడులా అడుగుపెట్టిన అతనే వరుణ్ తేజ్.

ఆ తర్వాత వచ్చే విజువల్స్ చూస్తే ఈ సారి ప్రవీణ్ సత్తారు డిజప్పాయింట్ చేయడు అనేలా ఉన్నాయి. ఇలాంటి యాక్షన్ సీన్స్ మనకు హాలీవుడ్ లో కనిపిస్తాయి. ఈ మేకింగ్ చూస్తే అదే కనిపిస్తోంది. ఇక ఈ ప్రీటీజర్ ఇంతకు మించి ఎక్కువగా చెప్పుకుంటే కాస్త తొంరపాటు అవుతుందేమో కానీ.. ఈ సినిమా వరుణ్ తో పాటు, ప్రవీణ్ కూడా కోరుకుంటోన్న విజయాన్ని ఇచ్చేలానే ఉంది అనిపిస్తోంది.


ఇక వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్,అభినవ్ గోమటం తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. మరి త్వరలోనే రాబోతోన్న టీజర్ తో ఈ గాండీవధారి గురించి మరిన్ని విశేషాలు తెలుస్తాయేమో.

Related Posts