గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. అసలు ఈపాటికే పూర్తవ్వాల్సిన ఈ సినిమా.. దర్శకుడు శంకర్ ‘ఇండియన్ 2’తో బిజీ అవ్వడంతో వాయిదా పడుతూ వస్తోంది. ‘ఇండియన్ 2’ అయిపోయింది.. ‘ఇండియన్ 3’కి సంబంధించి కొంత షూటింగ్ కూడా పూర్తైంది. అయినా.. ‘గేమ్ ఛేంజర్’ పూర్తవ్వడం లేదు. నత్తనడకన సాగుతోన్న ఈ క్రేజీ మూవీ ఈ వారంలో మరొక కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకోనుందట.
జూన్ 7న నుంచి ఆంధ్రప్రదేశ్ లో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కి రెడీ అవుతున్నాడట శంకర్. ఒక వారం రోజుల పాటు ఈ షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘గేమ్ ఛేంజర్’ ఇదే ఏడాది విడుదలవుతుందనే ప్రచారం జరుగుతుంది. కానీ.. రిలీజ్ డేట్ పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. తమన్ సంగీతాన్నందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘జరగండి జరగండి’ పాట విడుదలైంది. త్వరలోనే.. మరో సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట నిర్మాత దిల్ రాజు.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ మార్కెట్ లో ప్రధానమైన ఏరియా నార్త్ అమెరికా. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే దేశం…
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. స్టార్…
ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందే పాన్…
మాతృ భాష తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న కథానాయకుడు విజయ్ ఆంటోని. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ విజయ్…
రొటీన్ కమర్షియల్ మూవీస్ కి కాలం చెల్లింది. సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే కానీ.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.…
In just two days, 'Kalki' collected Rs. 300 crores at the box office worldwide. In…