లెజెండ్రీ సింగర్ చిత్ర ‘సారంగదరియా’ పాట

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో.. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్వి ఇతర కీలక పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘సారంగదరియా’. ఈ చిత్రాన్ని పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వంలో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ఎం.ఎబెనెజర్ పాల్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘అందుకోవా…’ అనే లిరికల్ సాంగ్ ను లెజెండరీ సింగర్ చిత్ర ఆలపించారు. ‘ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ చాలా ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పేలా, స్ఫూర్తిని నింపేలా.. ఈ పాట ఉంది. రాంబాబు గోశాల రాసిన ఈ గీతాన్ని లెజెండరీ సింగర్ చిత్ర తన గళంతో అద్భుతంగా ఆలపించారు.

Related Posts