ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో సినిమా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కొంతమంది అగ్ర కథానాయకులతోనే సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటాడు. అందుకే.. పనిచేసిన వారితోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటాడు. ఈ లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడు. ‘అఙ్ఞాతవాసి’ వంటి ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ ను ‘అరవింద సమేత’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన క్రెడిట్ తారక్ కే దక్కుతుంది.

‘అల.. వైకుంఠపురములో’ చేసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఎన్టీఆర్ తోనే తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశాడు. కానీ.. అనివార్య కారణాలతో మళ్లీ తారక్-త్రివిక్రమ్ కాంబో సెట్ అవ్వలేదు. అయితే.. మునుముందు ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ లోని ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ తరహాలో ఓ భారీ పీరియడ్ మూవీని తెరకెక్కించాలని ప్లాన్ చేశాడట త్రివిక్రమ్. ఇదే విషయాన్ని అప్పట్లో నిర్మాత నాగవంశీ తెలిపారు.

మళ్లీ తారక్-త్రివిక్రమ్ ఎప్పుడు కలిసి పనిచేస్తారో తెలీదు కానీ.. ‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాత్రం వీరిద్దరూ ఒకే వేదికపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్ 8న సాయంత్రం శిల్పకళావేదికలో డబుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ ‘టిల్లు స్క్వేర్’ జరగబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ కు చెందిన ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఈనేపథ్యంలో.. ‘టిల్లు స్క్వేర్’ సెలబ్రేషన్స్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఒకే వేదికను పంచుకునే అవకాశం కనిపిస్తుంది.

Related Posts