‘కంగువ’ డబ్బింగ్ షురూ.. రిలీజ్ డేట్ పై కొనసాగుతోన్న సస్పెన్స్

విలక్షణ నటుడు సూర్య పాన్ వరల్డ్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’. కమర్షియల్ డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుంది. ‘యానిమల్’ స్టార్ బాబీ డియోల్ కీ రోల్ లో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే షూటింగ్ ఫార్మాలిటీస్ ఓ కొలిక్కి రావడంతో లేటెస్ట్ గా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టింది టీమ్. సూర్య తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఫోటోను చిత్రబృందం విడుదల చేసింది. డైరెక్టర్ శివ కూడా సూర్య తో దగ్గరుండి డబ్బింగ్ చెప్పిస్తున్న ఫోటోలూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోన్న ‘కంగువ’ పలు భాషల్లో త్రీడిలో విడుదలకు ముస్తాబవుతోంది. అయితే.. ‘కంగువ’ ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకున్నా.. విడుదల తేదీ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ‘కంగువ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనుందట టీమ్.

Related Posts