ఏషియన్ సురేష్ చేతికి ‘ఇండియన్ 2’ నైజాం హక్కులు

తమిళంలో రూపొందిన కమల్ హాసన్ ‘ఇండియన్’ మూవీకి అనువాదం ‘భారతీయుడు’. 1996లో రిలీజై సూపర్ హిట్టైన ‘భారతీయుడు‘ సినిమాకి సీక్వెల్ గా వస్తోన్న సినిమాయే ‘భారతీయుడు 2′. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘భారతీయుడు 2′ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

‘భారతీయుడు 2’ చిత్రానికి తెలుగులోనూ భారీ బిజినెస్ జరుగుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమా నైజాం హక్కులను ఏషియన్ సురేష్ సంస్థ దక్కించుకుంది. ఈమధ్య వరుసగా తమిళ సినిమాలను నైజాం లో విడుదల చేస్తున్నాయి ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్. ఇప్పుడు ‘భారతీయుడు 2’ని నైజాంలో ఈ సంస్థలు విడుదల చేయబోతున్నాయి. ఈ సినిమాలో సిద్ధార్థ్, ఎస్.జె.సూర్య, బ్రహ్మానందం, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీసింహా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts