టాలీవుడ్

‘బేబి‘ సినిమా తన ఐడియా కాపీ కొట్టి తీశారంటోన్న ‘ప్రేమించొద్దు‘ దర్శకుడు

‘తన ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ అనే సినిమా తీశాడు.. సాక్ష్యాల‌తో స‌హా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్’ అనే బుక్ అందుబాటులోకి తెచ్చాను‘ అంటున్నాడు ‘ప్రేమించొద్దు’ సినిమా దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్. ‘రవి కిరణ్ అనే వ్యక్తిని 2015లో కలిశాను. తరువాత రవి కిరణ్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఓ పాయింట్ అనుకున్నాను. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి కథ అనుకున్నాం.

దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేష్ గారితో ఏడాది ప్రయాణం చేశాను. నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ ఆయనే సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఉండొచ్చేమో అనిపించి, ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశాను. అప్పుడు మాకేం గొడవ జరగలేదు. త‌ర్వాత నాకు దర్శకత్వం అవ‌కాశం ఇస్తానన్నాడు. నా క‌థ‌ను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో ‘బేబీ‘ అనే ఓ బూతు సినిమా తీశాడు‘ అని శిరీన్ శ్రీరామ్ చెప్పాడు.

2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు. నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేష్ గారిని కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చాడు. ‘హృదయ కాలేయం‘ సినిమాకు ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేసి, ఎడిట్ చేసి ఇచ్చాను. సాయం చేసిన వాళ్లకే వెన్నుపోటు పొడిచే రకం. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేస్ ఫైల్ చేశాను. నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదులు చేశాడు. ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశాను. దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నాను. https://babyleaks2023.blogspot.com/ అనే ఆన్ లైన్లో మాధ్యమంలో పీడీఎఫ్ కూడా ఉంది. వెబ్ సైట్ కూడా ఉంది. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు‘ అని శిరీన్ తాను డైరెక్ట్ చేసిన ‘ప్రేమించొద్దు‘ సినిమా ప్రెస్ మీట్ లో ఈ విషయాలు తెలిపాడు.

Telugu70mm

Recent Posts

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్

‘బలగం‘ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.…

1 hour ago

‘డార్లింగ్‘ నుంచి నభా నటేష్ ‘రాహి రే‘ సాంగ్

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘డార్లింగ్‘. ఈ మూవీలో అనన్య నాగళ్ల, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్…

1 hour ago

వెంకటేష్ సరసన కథానాయికలు ఖరారు..!

విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే హ్యాట్రిక్ మూవీ రేపు ముహూర్తాన్ని జరుపుకోనుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన…

2 hours ago

తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కండిషన్స్

సినిమాలు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే కాదని.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి…

2 hours ago