‘గేమ్ ఛేంజర్’ మ్యూజిక్ కి భలే డిమాండ్

భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ శంకర్. మూడు దశాబ్దాల క్రితం దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన శంకర్.. తన తొలి చిత్రం ‘జెంటిల్ మేన్’ నుంచే భారీ సినిమాలకు శ్రీకారం చుట్టాడు. శంకర్ తన సినిమాల్లోని ఫైట్స్, సాంగ్స్ అన్నీ భారీగానే ఉండాలని కోరుకుంటాడు. ఇక.. శంకర్ సినిమాల్లోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాను తీర్చిదిద్దే ఒక్కో పాటతో ఓ మినీ బడ్జెట్ మూవీనే తీయొచ్చు.

ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ పాటల విషయంలోనూ తనదైన మార్క్ చూపించాడట శంకర్. ఈ సినిమాలోని పాటలన్నీ ఎంతో డిఫరెంట్ గా డిజైన్ చేశాడట. ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ ర‌క్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వంటి కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఈ పాటలను లావిష్ గా చిత్రీకరించారట. ఇక.. దీపావళి కానుకగా ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ‘జరగండి’ అంటూ సాగే తమన్ స్వరపరిచిన ఈ గీతాన్ని కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియాలో లీక్ చేశారు. లీక్ చేసిన వారిని తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక.. ‘గేమ్ ఛేంజర్’ ఆడియో రైట్స్ ను సరిగమా సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్. మొత్తంమీద.. ఎన్నో అంచనాలతో రాబోతున్న ‘జరగండి’ గీతం ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Posts