రెండో పెళ్లి చేసుకున్న అమలా పాల్

అమలా పాల్ తన ప్రియుడు జగత్ దేశాయ్ ను వివాహ మాడింది. ఇటీవలే అమలా పాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ప్రపోజ్ చేశాడు జగత్ దేశాయ్. కొచ్చిలో అమలా పాల్, జగత్ దేశాయ్ వివాహం జరిగింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది.

‘మమ్మల్ని ఒకటి చేసిన ప్రేమను సెలెబ్రేట్ చేసుకుంటున్నాం. నా దివ్యమైన పురుషుడిని వివాహం చేసుకున్నా. మీ ప్రేమ, ఆశీర్వాదాలను కోరుతున్నా’ అంటూ తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అమలా పాల్.

అమలా పాల్ గతంలో దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను వివాహ మాడింది. విజయ్ దర్శకత్వంలో పలు సినిమాల్లో నటించిన అమలా పాల్ అతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పట్లో ఇరు కుటుంబాల అంగీకారంతో వీరు వివాహం చేసుకున్నారు.

అయితే.. పెళ్లయిన కొన్నాళ్లకే విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ఆ తర్వాత ఏ.ఎల్.విజయ్.. ఐశ్వర్య అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఇప్పుడు.. జగత్ దేశాయ్‍ ను అమలా పాల్ రెండో పెళ్లి చేసుకుంది.

Related Posts