‘మన్మథుడు‘ జంట మళ్లీ కలిసింది

కొంతమంది కథానాయికలు కొన్ని సినిమాల్లోనే కనిపించినా.. ప్రేక్షకుల్లో వారు వేసే ముద్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి వారిలో ‘మన్మథుడు‘ భామ అన్షు ఒకరు. 2002లో వచ్చిన ‘మన్మథుడు‘ చిత్రంలో సెకండ్ లీడ్ లో మెరిసిన అన్షు.. తన అందంతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఆ తర్వాత ఏడాది ప్రభాస్ తో ‘రాఘవేంద్ర‘లోనూ మురిపించింది. అంతే.. తర్వాత పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్ చెక్కేసింది.

కట్ చేస్తే.. మళ్లీ 22 ఏళ్ల తర్వాత వార్తల్లోకి వచ్చింది అన్షు అంబానీ. రీసెంట్ గా నవ మన్మథుడు నాగార్జునను కలిసిందట. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఔదార్యం, మంచిగా ఉండటం అనేవి నాగ్ సర్‌ లో మరింతగా పెరిగాయి. ఈ జ్ఞాపకాలు మరింత పదిలంగా ఉంటాయి’ అని అన్షు రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఫొటోలు అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి.

Related Posts