యాక్షన్‌లోకి దిగిన ‘రాబిన్‌ హుడ్‌’

భీష్మ సినిమాతో బ‌్లాక్‌ బస్టర్‌ అందుకున్న నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్‌ మరోసారి రాబిన్‌ హుడ్ తో రాబోతుంది. దొంగ క్యారెక్టర్‌లో కంప్లీట్ హ్యూమర్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ద్ది రోజుల క్రితం విడుదల చేసిన క్యారెక్టర్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. వెంకీ కుడుముల, నితిన్ పాత్రను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నారు. పాత్ర సీరియస్‌గా కనిపించినా, అతని యాక్షన్స్ ఫన్‌ క్రియేట్ అవుతుంది.
ఈ సినిమా నుంచి సూపర్బ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈసినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ని అద్భుతంగా డిజైన్ చేస్తున్నారట. తాజాగా టీమ్ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభించింది. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వచ్చే రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఈ యూనిక్ యాక్షన్ బ్లాక్‌ని ఇంట్రస్టింగ్‌గా డిజైన్ చేశారు.

Related Posts