కొత్తగా వస్తోన్న దర్శకులు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తున్నారు. అఫ్ కోర్స్ అందరూ కాదు. కొందరు మాత్రమే. ఆ మధ్య కరోనా టైమ్ లో కలర్ ఫోటో అనే సినిమాతో దర్శకుడుగా మారాడు సందీప్ రాజ్. అతను అంతకు ముందు యూ ట్యూబ్ లో అనేక షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉన్నాడు. అతనితో పాటు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన తన ఫ్రెండ్స్ సుహాస్, చాందిని చౌదరి జంటగా రూపొందించిన ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది.
కలర్ అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ నేపథ్యంలో మంచి ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రానికి మంచి అభిమానులు కూడా ఉన్నారు. కలర్ ఫోటో తర్వాత సందీప్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. తీసుకున్నాడా వచ్చిందా అనేది తెలియదు కానీ.. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు. ఈ కాంబినేషన్ ఎవరూ ఊహించలేరు కూడా.
మాస్ మహరాజ్ రవితేజ, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోలుగా ఓ సినిమా వస్తుందనే వార్త కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అది నిజమే. దానికి దర్శకుడు ఈ సందీప్ రాజ్. తను నటించే దర్శకుల విషయంలోనే జాగ్రత్తగా ఉంటాడు రవితేజ. ఇంక మల్టీస్టారర్ అంటే ఖచ్చితంగా అతన్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏదో ఉండాలి. అలాగే తనూ స్వయంగా రచయిత, దర్శకుడు కూడా అయిన విశ్వక్ కూడా ఈ మల్టీస్టారర్ కు ఎస్ చెప్పాడంటే అతనికీ ఏదో ఓ కొత్త పాయింట్ కనిపించి ఉండాలి.
ఈ ఇద్దరే సర్ ప్రైజ్ అనుకుంటే ఇక ఈ ప్రాజెక్ట్ లో విలన్ గా మంచు మనోజ్ ఫైనల్ అయ్యాడు. హీరోగా ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ కొట్టలేకపోయిన మనోజ్.. ఫస్ట్ టైమ్ తన తండ్రి మొదట్లో చేసిన పాత్రల వైపు వస్తున్నాడు. మోహన్ బాబు విలన్ గా మెప్పించి హీరో అయ్యాడు. మనోజ్ హీరోగా ఫెయిల్ అయ్యి విలన్ మారుతున్నాడు. సో.. రవితేజ, విశ్వక్ సేన్ హీరోలుగా.. మంచు మనోజ్ విలన్ గా నటించే ఈ సినిమాను ఎస్కేఎన్ నిర్మించబోతున్నాడు. అతనితో పాటు ఇంకా ఒకరిద్దరు నిర్మాతలు కూడా జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి.
అయితే రవితేజ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ కు డేట్స్ ఎప్పుడు ఇస్తాడనేది ఇంకా తేలలేదు. ఒకవేళ ఈ కథే విపరీతంగా నచ్చితే ఆల్రెడీ కమిట్ అయిన కథలను కాస్త వెనక్కి నెట్టి ఈ మూవీకే ఓకే చెప్పినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా టాలీవుడ్ లో ఇదో క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి.
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…
Man of masses NTR's birthday.. Only two more days left. He is acting as Young…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…