ఆస్కార్ విజేత కీరవాణి ఎంతమంది హీరోలతో పనిచేసినా.. కింగ్ నాగార్జునతో మాత్రం ఆయనకు స్పెషల్ బాండింగ్ ఉంది. నాగ్, కీరవాణి కాంబోలో ఇప్పటివరకూ దాదాపు 15 సినిమాలొచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం మ్యూజికల్ హిట్స్. ఇక.. తన తమ్ముడు రాజమౌళి కంటే కూడా ఎక్కువ సినిమాలు నాగార్జునకే పనిచేశాడు కీరవాణి. ఇప్పుడు మరోసారి నాగార్జున-కీరవాణి కాంబోలో రాబోతున్న చిత్రం ‘నా సామిరంగా’.
‘ఆర్.ఆర్.ఆర్’తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన కీరవాణి, చంద్రబోస్ లు ‘నా సామిరంగా’ చిత్రానికి పనిచేస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో నాగార్జున, కీరవాణి, చంద్రబోస్ కలిసున్న ఫోటోని రిలీజ్ చేసింది టీమ్. ఈ ముగ్గురు కాంబోలో సెన్సేషనల్ ఆల్బమ్ గ్యారంటీ అని తెలుపుతూ.. సంక్రాంతికి ‘నా సామిరంగా’ సందడి మొదలవ్వబోతుందని మరోసారి హింట్ ఇచ్చారు మేకర్స్. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి బెజవాడ ప్రసన్నకుమార్ రచయితగా వ్యవహరిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…