రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఆదిపురుష్ కు రెండు తెలుగు రాష్ట్రాలు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాయి. రిలీజ్ రోజు నుంచి మూడు రోజుల ఆరు షోస్ ప్రదర్శించుకునే వెసులు బాటుతో పాటు ఇప్పుడున్న టికెట్ ధరలకు అదనంగా మరో 50 రూపాయలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చాయి. ఈ మేరకు రెండు ప్రభుత్వాలూ జీవోను కూడా జారీ చేశాయి. శుక్రవారంతో నుంచి ఆదివారం వరకూ మాత్రమే ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి.
దీనివల్ల మల్టీ ప్లెక్స్ ల్లో చూసే ఆడియన్స్ తో పాటు సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ పైనా అదనంగా మరో యాభై రూపాయలు భారం పడుతుంది. అయినా ఇది రామాయణ కావ్యం దీనికి తోడు తెలుగు వాడైన ప్రభాస్ ఫస్ట్ టైమ్ రాముడు పాత్రలో నటించడం.. అది ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదలవుతుండటంతో ఇదేమంత పెద్ద భారం కాదు అనే భావిస్తున్నారు చాలామంది.
ఇక పెరిగిన టికెట్ ధరలతో ఆదిపురుష్ డే వన్ కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతానికి మొదటి రోజు రికార్డ్స్ 74 కోట్లు ఆర్ఆర్ఆర్ మూవీపేరుతో ఉంది. ఆదిపురుష్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందనే చెప్పొచ్చు. మొత్తంగా కృతి సనన్ సీత పాత్రలో నటించిన ఈ మూవీలో రావణుడుగా సైఫ్ అలీఖాన్ నటించాడు. ఇప్పటికైతే దేశవ్యాప్తంగా ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. దేశవ్యాప్తంగా ఎన్నో రికార్డులు బ్రేక్ అవుతాయనే చెప్పాలి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…