టాలీవుడ్

ఆ ప్రతిధ్వని ప్రకంపనలు పుట్టిస్తుంది..

మాస్ మహరాజ్ రవితేజ సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఎంత రొడ్డకొట్టుడు కథ నుంచి అయినా తనదైన శైలిలో వినోదం పండిస్తాడు. హిట్టూ ఫ్లాపులతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళుతోన్న మాస్ రాజా ఈ యేడాది ఇప్పటికే వాల్తేర్ వీరయ్య, రావణాసుర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. వాల్తేర్ వీరయ్యలో చిన్న పాత్రే అయినా పెద్ద ఇంపాక్ట్ వేశాడు. రావణాసుర పోయినా ఇమ్మీడియేట్ గా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై కాన్ సెంట్రేట్ చేశాడు.

అందులో ఒకటి టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ తో ప్యాన్ ఇండియన్ లెవల్లో మెప్పించాడు అనే చెప్పాలి. టైగర్ నాగేశ్వరరావు దసరా సందర్బంగా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. దీంతో మరో రెండు సినిమాలు చస్తున్నాడు రవితేజ. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడుగా మారిన కార్తీక్ ఘట్టమనేనితో ఈగల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికే అదిరిపోయే ప్లానింగ్స్ చేశారు.

రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ” ఆ లావాకు ఒక పేరుంది” అంటూ హల్చల్ చేస్తున్నారు. ఈ మాటే చాలామందిలో ఆసక్తిని పెంచింది. ఇదేంటా అని ఆలోచిస్తూ ఉన్నారు. అందరికీ అప్డేట్ ఇస్తూ.. ఈ మంగళవారం సాయంత్రం 6గంటల 3 నిమిషాలకు ఓ భారీ విస్ఫోటనం రాబోతోందని చెబుతూ 20 సెకన్ల వీడియో విడుదల చేశారు. ఈ వీడియోతో పాటు..


” ఆ లావాకి ఒక పేరుంది. ఆ పేరుకి ఒక ప్రతి ధ్వని ఉంది. ఆ ప్రతిధ్వని .. ఒక ప్రకంపనం పుట్టిస్తుంది ” అనే మాటలు ఉంచారు. అలాగే ”మెడలు దించి బ్రతికేవాళ్లందరూ మెడలు వంచి బతికేవాడికోసం ఎదురుచూసేది వాడి ముందు మెడలు వంచడానికే .. చూస్తారుగా ,.,” అంటూ మరో కొటేషన్. ఇవన్నీ ఈ సినిమాపై అంచనాలను కూడా పెంచుతున్నాయి. మొత్తంగా మంగళవారం సాయంత్రం ఇంకెలాంటి అప్డేట్ వస్తుందా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూసేలా ఉంది ఈ అప్డేట్. ఇంతకీ ఆ భారీ విస్ఫోటనం ఏమై ఉంటుందో..?

Telugu 70mm

Recent Posts

Chandini Chowdary with two movies in one day

Comments are being heard that Telugu girls are starving in the Telugu film industry. At…

27 mins ago

Sai Dhansika’s ‘Anthimatheerpu’ on June 21

Sai Dhansika of 'Kabali' fame is a lady oriented movie 'Anthimatheerpu'. Amit Tiwari played another…

32 mins ago

Disha Patani first look from ‘Kalki’

The team increased the speed in the promotion of the most awaited movie 'Kalki'. The…

36 mins ago

Arrest warrant for actor Prithviraj

Telugu film industry is haunted by series of controversies. Recently, actress Hema was arrested at…

41 mins ago

Let’s show the power of Telugu cinema to the world.. Nag Ashwin

Hollywood superhero movies are very crazy in India. Some of the superhero films related to…

45 mins ago