టాలీవుడ్

ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ తో ‘తమ్ముడు’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని అయిన నితిన్.. ఇప్పుడు అతని సూపర్ హిట్ టైటిల్ ను వాడుకుంటూ చేస్తోన్న సినిమా ‘తమ్ముడు’. ‘ఎమ్.సి.ఎ, వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ‘తమ్ముడు’ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది.

మీడియం రేంజ్ హీరోస్ లో ముందు వరుసలో నిలిచే నితిన్ ఈ సినిమాలో చేసే హై వోల్టేజ్ యాక్షన్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుందట. అలాగే.. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ గురించి పెడుతోన్న బడ్జెట్ చిత్రవర్గాల్లో చర్చకు కారణమైంది. ఆమధ్య ‘తమ్ముడు’ కోసం షూట్ చేసిన యాక్షన్ పార్ట్ కి ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు అయ్యిందనే ప్రచారం జరిగింది. లేటెస్ట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఓ భారీ సెట్ లో మరో యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారట.

‘కాంతార’ ఫేమ్ విక్రమ్ మోర్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తోన్న ఈ యాక్షన్ సీన్ కూడా సినిమాకి హైలైట్ అవుతుందంటున్నారు మేకర్స్. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, ‘కాంతార’ ఫేమ సప్తమి గౌడ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీతోనే రీఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నితిన్ కి అక్క పాత్రలో కనిపించనుందట లయ.

Telugu 70mm

Recent Posts

వరలక్ష్మి పెళ్లిసందడిలో బాలకృష్ణ, వెంకటేష్

వరలక్ష్మి శరత్ కుమార్ - నికోలై సచ్‌దేవ్‌ పెళ్లి సందడి మొదలైంది. ఈ సెలబ్రేషన్స్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలకు…

28 mins ago

టాలీవుడ్ కి అసలు సిసలు కింగ్ ప్రభాస్

గడిచిన దశాబ్ద కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ బాగా పుంజుకుంది. కలెక్షన్ల పరంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఓ బెంచ్…

35 mins ago

ఎన్టీఆర్-జాన్వీ మాస్ డ్యూయెట్ కి సర్వం సిద్ధం

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ను మరింత ఎలివేట్ చేసే మూవీ 'దేవర'. కొరటాల శివ…

41 mins ago

పవన్ సినిమాల పరిస్థితిపై వచ్చిన క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలతో నిమగ్నమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈనేపథ్యంలో.. పవన్…

51 mins ago

‘విశ్వంభర‘ కోసం లైన్లోకి వచ్చిన లారెన్స్

చిత్ర పరిశ్రమలో చిరంజీవి ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో కొరియోగ్రాఫర్ లారెన్స్ ఒకడు. ‘ముఠామేస్త్రి‘లో గ్రూప్ డ్యాన్సర్ గా…

58 mins ago

విజయ్ సేతుపతికి జోడీగా నిత్యా మీనన్

ఇటీవలే తన ప్రతిష్ఠాత్మక 50వ సినిమా ‘మహారాజ‘తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ సేతుపతి. ‘మహారాజ‘ తర్వాత…

1 hour ago