అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TFJA) అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ప్రధాన సభ్యులంతా కలిసి జాతీయ ఉత్తమ నటుడుగా ఎంపికైన అల్లు అర్జున్ కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఒక బొకేతో వెళ్లి ఐకన్ స్టార్ ను కలిశారు. 70యేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డ్ అందుకున్న మొదటి నటుడుగా అల్లు అర్జున్ ప్రతిభను ప్రశంసించారు.

రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని గొప్ప విజయాలతో పాటు అవార్డులూ అందుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇండస్ట్రీ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని తెచ్చుకున్న TFJA తనకు శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల అల్లు అర్జున్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ బెస్ట్ యాక్టర్ ను కలిసిన వారిలో TFJA అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు, కోశాధికారి నాయుడు, ఆడిటర్ మూర్తితో పాటు ఇతర జర్నలిస్ట్ ప్రముఖులు ఉన్నారు.

Related Posts