ఎన్టీఆర్ చెప్పాడు.. మరి రామ్ చరణ్..

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా ఎంపికైన దగ్గర్నుంచీ.. ఇండస్ట్రీ అంతా కోలాహలంగా ఉంది. 70యేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ నటుడుగా అవార్డ్ అందుకున్న ఫస్ట్ హీరోగా అల్లు అర్జున్ చరిత్రలో నిలిచిపోతాడు. అందుకే పరిశ్రమ మొత్తం నుంచీ అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నా పెద్ద నటుల నుంచి టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంతా గ్రీటింగ్స్ చెబుతున్నారు.

ఈ క్రమంలో అందరికంటే కాస్త ముందుగానే అల్లు అర్జున్ కు శుభాకాంక్షలుచెప్పాడు ఎన్టీఆర్. ” కంగ్రాట్యులేషన్స్ బావా.. ఈ విజయానికి అవార్డ్ కు నువ్వు అన్ని విధాలా అర్హుడవు.. ” అని ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కూడా వైరల్ అయింది. ఆ ట్వీట్ చూసి అంత బిజీలో కూడా అల్లు అర్జున్ ఎన్టీఆర్ కు రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లై కాస్త ఆశ్చర్యంగా ఉంది. ” నీ జెన్యూన్ విషెస్ కు థ్యాంక్యూ సో మచ్ బావా.. టచ్ చేశావు.. ” అని రిప్లై ఇచ్చాడు అల్లు అర్జున్. జెన్యూన్ అనడంలో రెండు అర్థాలు వెదుతుకున్నారు నెటిజన్‌స్.

ఒకటి ఎన్టీఆర్ కూడా పోటీలో ఉన్నాడు. అయినా వెంటనే విష్ చేశాడు. రెండోది.. అదే పోటీలో రామ్ చరణ్‌ కూడా ఉన్నాడు. అయినా విష్ చేయలేదు. అంటే చరణ్ కంటే ఎన్టీఆర్ తన పట్ల జెన్యూన్ గా ఉన్నాడు అని అర్థమా అంటున్నారు.


కానీ నిజానికి రామ్ చరణ్ ఇలాంటివి చేయడు అని అందరికీ తెలుసు. తను ఎక్కడో షూటింగ్ లో ఉన్నాడు. అందుకే విష్ చేయడం ఆలస్యం అయి ఉంటుంది. అంతే తప్ప వీరి ఫ్యామిలీ బాండింగ్ గురించి అందరికీ తెలుసు కదా.. కాస్త ఆలస్యం అయినా అన్నీ సర్దుకుంటారు. కాకపోతే రామ్ చరణ్‌ మాత్రమే కాదు.. అటు మెగాస్టార్ కానీ.. మెగా ఫ్యామిలీ హీరోలు కానీ వెంటనే రిప్లై ఇవ్వలేదు. ఇదే కాస్త డౌటింగ్ కొడుతుందనే బ్యాచ్ కూడా ఉంది. ఆ బ్యాచ్ లు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. ముందు ఈ మూమెంట్ ను ఎంజాయ్ చేద్దాం అని అల్లు అర్జున్ ఆర్మీ అనుకుంటే అంతకు మించిన ఆనందం ఏముంటుందీ.. ?

Related Posts