తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌.. హెల్త్ కార్డ్స్ పంపిణీ

తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటై రెండు దశాబ్ధాలు పూర్తయ్యింది. సభ్యుల ఆరోగ్య, సంక్షేమం విషయంలో టిఎఫ్‌జెఏ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. ప్రతీ సభ్యుడి కుటుంబానికి అండగా నిలుస్తోంది. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో, కుటుంబ స‌భ్యుల‌కు రూ.5 లక్ష‌లు ఆరోగ్య భీమా సౌకర్యం ఉంటుంది. అలాగే టర్మ్ పాలసీ విష‌యానికి వ‌స్తే స‌భ్యుడికి రూ.15 ల‌క్ష‌లు, యాక్సిడెంటల్ పాలసీ స‌భ్యుడికి రూ.25 ల‌క్ష‌ల‌ను అందేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరు సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది. 2004 – 05 ఏడాదికి సంబంధించి సభ్యత్వం తీసుకున్న జర్నలిస్ట్‌లకు గుర్తింపు కార్డులతో పాటు హెల్త్‌ కార్డ్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ, ఆర్‌ నారాయణ మూర్తి, దిల్‌రాజు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఎఫ్‌జెఎ అధ్య‌క్షుడు ల‌క్ష్మీ నారాయ‌ణ‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ వై.జె.రాంబాబు, ట్రెజ‌ర‌ర్ సురేంద్ర నాయుడు స‌హా అసోసియేష‌న్ స‌భ్యులు.. జ‌ర్న‌లిస్ట్‌లు పాల్గొన్నారు.


ఈ 20 ఏళ్ల కాలంలో ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ క‌లిపి 181 మంది ఉన్నాం. ఇదీ మ‌న కెపాసిటీ ఇవాళ‌. 2004లోప్రింట్‌, చానెల్స్ ఉన్నాం. ఇవాళ డిజిట‌ల్ మీడియా కూడా క‌లిపి ఉన్నాం. మ‌నం సాధించాల్సిన విష‌యాలు ఇంకా చాలా ఉన్నాయి. మెడిక‌ల్ మాత్ర‌మే కాదు, హౌసింగ్ ఉంది… ఇంకా చాలా ఉంది. టీఎఫ్‌జేఏకి వెన్నంటు ఉంటూ మ‌న‌ల్ని న‌డిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవిగారికి ధ‌న్య‌వాదాలు చెప్పుకోవాలి. కోవిడ్ టైమ్‌లో చిరంజీవిగారు మ‌న అసోసియేష‌న్‌కి యోధా డ‌యోగ్న‌స్టిక్స్ ద్వారా 50 శాతం వెసులుబాటు క‌ల్పించారు. త‌ల్లిదండ్రుల‌కు కూడా ఈ స‌దుపాయాన్ని అంద‌జేశారు. కోవిడ్ టైమ్‌ లో అసోసియేషన్‌ ఎనలేని సేవలందించింది. ఇవాళ మెడిక‌ల్ ఇన్య్సూరెన్స్ ప్ర‌తి వ్య‌క్తికీ 10 ల‌క్ష‌ల‌ను అందిస్తున్నాం. అందులో 5 ల‌క్ష‌లు మెంబ‌ర్‌కి, 5 ల‌క్ష‌లు ఫ్యామిలీకి ఇస్తున్నాం. ఇందులో స‌గం మెంబ‌ర్ క‌ట్టుకుంటే, స‌గం అసోసియేష‌న్ భ‌రిస్తోంది. అలాగే ట‌ర్మ్ పాల‌సీ ప్ర‌తి స‌భ్యుడికీ 15 ల‌క్ష‌లు ప్ర‌తి ఏడాదీ ఇస్తున్నాం. ఎవ‌రికీ ఏమీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకుందాం. ఒక‌వేళ జ‌రిగితే వాళ్ల కుటుంబాల‌కు ఇస్తున్నాం. బి.ఎ.రాజు, ట్రేడ్ గైడ్ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు అందించాం. 25 ల‌క్ష‌ల రూపాయ‌లు యాక్సిడెంట‌ల్ పాల‌సీని అందిస్తున్నాం. జ‌ర‌గ‌రానిది జ‌రిగితే, వారి కుటుంబానికి 25 ల‌క్ష‌లు వెళ్తుంది. ఆఫీసుల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితుల్లో ఉంటే వారి శాల‌రీ నుంచి 70 శాతం 16 నెల‌లు అందిస్తాం. ఇలా ఈ మ‌ధ్య‌న మేం కిశోర్‌కి అంద‌జేశాం. అయితే అత‌ను ఆ డ‌బ్బును తీసుకోకుండా, పాల‌సీ క‌ట్ట‌లేని ప‌రిస్థితిలో ఉన్న‌వారికి త‌న త‌ర‌ఫున క‌ట్ట‌మ‌ని చెప్పాడని తెలియజేసారు ట్రెజరర్‌ సురేంద్రనాయుడు.


ర్న‌లిస్టుల‌కు శ్రీనివాస‌రెడ్డిగారు ల్యాండ్‌లు ఇప్పిస్తే, అంద‌రూ ఆనందంగా ఉంటారు. జ‌ర్న‌లిస్టుల హెల్త్ కార్డుల సెల‌బ్రేష‌న్‌లో నేను పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాస‌రెడ్డిగారు ఇన్ని మాట్లాడుతుంటే నాకు చాలా విష‌యాలు తెలిశాయి. ఆయ‌న చాలా స్ట్రాంగ్ గైడ్ అనిపిస్తోంది. నా కెరీర్ మొద‌టి నుంచీ జ‌ర్న‌లిస్టులు నాతోనే ఉన్నారు. నేను కాలేజ్‌లో ఉన్న‌ప్పుడు మెడిక‌ల్ బిల్లులు ఎక్కువ వ‌స్తాయేమోన‌ని భ‌య‌ప‌డి హెల్త్ ఇన్‌స్యూరెన్స్ లు తీసుకునేవాడిని. వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. కొన్నిసార్లు రెన్యువ‌ల్‌కి డ‌బ్బులు ఉండేవి కాదు. అలా ఎన్నిటినో వ‌దిలేశాను. ఇప్పుడు ఈ అసోసియేష‌న్ ద్వారా అంద‌రూ యుటిలైజ్ చేసుకుంటున్నార‌ని తెలిసి ఆనందంగా అనిపించిందన్నారు విజయ్‌ దేవరకొండ.


ఫ్యామిలీస్టార్ అని టైటిల్ పెట్టిన‌ప్పుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ని స్టార్‌గా చూపించ‌డానికి పెట్టుకున్నాన‌ని అనుకున్నారు. ఎక్క‌డో ఉన్న మీ కుటుంబాల‌ను పైకి తీసుకురావ‌డం కోసం కృషి చేసే మీలాంటి స్టార్ గురించి చూపిస్తున్నాం. ఎక్క‌డి నుంచో వ‌చ్చి, సొసైటీలో ఫ్యామిలీస్‌కి మ‌ర్యాద‌ను తెచ్చిపెట్టే ప్ర‌తి ఒక్క‌రూ ఫ్యామిలీస్టారే. అదే మా సినిమా కాన్సెప్ట్ `హెల్త్ కోసం ఇవాళ తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్టులు చేస్తున్న ఈ కార్య‌క్ర‌మం చూస్తుంటే ఆనందంగా ఉంది. అంద‌రికీ శుభాకాంక్ష‌లు. మీలో ఎక్కువ‌మంది 40 ఏళ్లు దాటిన‌వారే. కొన్ని సినిమాల్లో సొసైటీలో అత్యంత గౌర‌వ‌మున్న పాత్ర‌ల‌ను చూపించేవారు. అందులో జ‌ర్న‌లిస్ట్ కేర‌క్ట‌ర్ ఉంటుంది. ఎన్నో సినిమాల్లో జ‌ర్న‌లిస్టుల‌కు ఎంతో ఇంపార్టెన్స్ ఉండేదన్నారు దిల్‌రాజు
జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌ను ఫ్రీగా ఇప్పించండి. స్థ‌లాల‌ను రేవంత్‌రెడ్డిగారిని అడ‌గండి. ఇళ్లు మీరు క‌ట్టుకోండి. శ్రీనివాస‌రెడ్డిగారు స్థ‌లాల‌ను ఇప్పించి పుణ్యం క‌ట్టుకోవాలి. తుపాకి క‌న్నా క‌లానికి భ‌య‌ప‌డ‌తాన‌ని అన్నారు నెపోలియ‌న్‌. ఎంతో మంది జ‌ర్న‌లిస్టులను క‌న్న‌ది సినిమా త‌ల్లి. ఆ రోజుల్లో వారం రోజుల‌కు త‌ర్వాతే రివ్యూలు రాసేవారు. కానీ ఇప్పుడు మార్నింగ్ షోకే రాస్తున్నారు. ఇవాళ సినిమా మూడు రోజులే బ‌తుకుతోంది. సినిమా గురించి రాస్తున్నప్పుడు ద‌య‌చేసి సినిమాను చంపేయ‌కండి. కేర‌క్ట‌ర్ అసాసినేష‌న్ చేయ‌కండి అన్నారు ఆర్‌ నారాయణ మూర్తి.

Related Posts