మలేషియాలో 90 ఏళ్ల తెలుగు సినిమా వేడుకలు

తెలుగు సినిమా ఎన్నో మైలురాళ్లను దాటింది.. ఎన్నో విప్లవాత్మక మార్పులు సంతరించుకుంది. ఎన్నో చారిత్రక విజయాలు, మరెన్నో మరపురాని జ్ఞాపకాలను ప్రోది చేసుకుంది. ఇప్పటికి తెలుగు సినిమా పుట్టి 90 ఏళ్లయింది. అప్పట్లో వజ్రోత్సవం జరిపినట్టుగానే.. ఈ 90 ఏళ్ల ఘన చరిత్రను సెలబ్రేట్ చేసుకోవడానికి నిర్ణయించింది తెలుగు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌. శనివారం నాడు హైదరాబాద్ పార్క్ హయత్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. 90 ఏళ్ల తెలుగు సినిమా వేడుకను త్వరలో మలేషియాలో నవతిహి పేరిట ఈ చారిత్రాత్మక ఈవెంట్ జరపడానికి నిశ్చయించినట్టు తెలిపారు.


నటి మధుమిత శివబాలాజి హోస్ట్‌ గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మలేషియా నుంచి వచ్చిన అడ్వైజర్ ధాతుక్ కమలనాథన్ , మలేషియా టూరిజం డైరెక్టర్ ఇండియా, శ్రీలంక ప్రతినిధి రాజౌది అబ్దుల్ రాహిమ్ పాల్గొన్నారు. ఇండియా – మలేషియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. టూరిజం మలేషియా ఈ ప్రోగ్రాంకి సపోర్ట్ చేస్తున్నందుకు మా టూరిజం ఇండస్ట్రీకి కూడా చాలా ఉపయోగపడుతుంది, మలేషియాలో కలుద్దాం’ అని తెలిపారు.


కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం వాయిదా పడుతూ వస్తుంది. అలాగే ఈ ప్రోగ్రాం నుంచి “మా” కోసం ఫండ్ రైజింగ్ కూడా చేద్దామనుకున్నాం. మలేషియా గవర్నమెంట్ తో చేయాలని నిర్ణయించుకున్నాం. రెండేళ్ల క్రితం నేను మలేషియాలో షూట్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే కమల్ నాథ్ గారే నాకు ఎంతో సపోర్ట్ చేసారు. ‘మా’ తరపున బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్ ను జులైలో మలేషియాలో చేయబోతున్నాము. డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సినీ పరిశ్రమ పెద్ధలతో‌ మాట్లాడి డేట్ ను ఎనౌన్స్ చేస్తామన్నారు మంచు విష్ణు.

Related Posts