టాలీవుడ్

అక్కినేని మల్టీస్టారర్ ‘మనం’ చిత్రానికి పదేళ్లు

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానిది ప్రత్యేక స్థానం. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.. ఆ తర్వాత ఆయన వారసుడిగా ప్రవేశించిన నాగార్జున.. ఇక.. మూడోతరం వారసులు నాగచైతన్య, అఖిల్ వంటి అందరూ నటించిన సినిమా ‘మనం’. అలాగే.. అక్కినేని వారి కోడలు అమల, మాజీ కోడలు సమంత కూడా ఈ సినిమాలో కనిపించారు.

ముఖ్యంగా.. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య వంటి మూడు తరాల నటులు ప్రధాన పాత్రల్లో ‘మనం’ చిత్రం రూపొందింది. నటసామ్రాట్ నటించిన చివరి సినిమా కూడా ఇదే. అందుకే.. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా ఎంతో ప్రత్యేమైనది.

ముందుగా తమ ఫ్యామిలీ మల్టీస్టారర్ కోసం కృష్ణవంశీని దర్శకుడిగా అనుకున్నాడు కింగ్ నాగార్జున. ఆ తర్వాత విక్రమ్ కుమార్ లైన్లోకి వచ్చాడు. కొన్ని హాలీవుడ్ సినిమాల రిఫరెన్సెస్ తో తయారు చేసుకున్న ‘మనం’ కథ అత్యద్భుతంగా పండింది. ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా మే 23, 2014న విడుదలై అఖండ విజయాన్ని సాధించింది.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వేల్యూస్, అనూప్ రూబెన్స్ సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ ‘మనం’ని మరో లెవెల్ లో నిలబెట్టాయి. ‘మనం’ విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా మళ్లీ ఈ సినిమాని ఈరోజు రీ-రిలీజ్ చేశారు. అక్కినేని కుటుంబం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా థియేటర్లలో వీక్షిస్తుంది.

Telugu 70mm

Recent Posts

రాజ్ తరుణ్ యాక్షన్ అవతార్ లో ‘తిరగబడరసామీ..‘

యంగ్ హీరో రాజ్ తరుణ్ యాక్షన్ అవతారమెత్తాడు. సీనియర్ డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరసామీ..‘ అనే సినిమాతో ప్రేక్షకుల…

1 hour ago

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్

‘బలగం‘ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.…

2 hours ago

‘డార్లింగ్‘ నుంచి నభా నటేష్ ‘రాహి రే‘ సాంగ్

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘డార్లింగ్‘. ఈ మూవీలో అనన్య నాగళ్ల, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్…

3 hours ago

వెంకటేష్ సరసన కథానాయికలు ఖరారు..!

విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే హ్యాట్రిక్ మూవీ రేపు ముహూర్తాన్ని జరుపుకోనుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన…

3 hours ago

తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కండిషన్స్

సినిమాలు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే కాదని.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి…

3 hours ago