‘సూపర్ యోధ’గా తేజ సజ్జ.. విలన్ గా మంచు మనోజ్?

‘హనుమాన్’ సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు తేజ సజ్జ. బాల నటుడిగానే బుల్లి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న తేజ.. ‘హనుమాన్’తో పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన కలెక్షన్ల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘హనుమాన్’ తర్వాత మరోసారి ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో 36వ చిత్రంగా ఇది రూపొందుతోంది. ఈ సినిమాకి ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ‘ప్రతి చరిత్రకు ఒక రహస్యం ఉంటుంది.. ఈ రహస్యానికి చరిత్ర ఉంది’ అంటూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ తో ఈ సినిమాకి సంబంధించి ఓ అనౌన్స్ మెంట్ పోస్టర్ విడుదల చేసింది నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

‘సూపర్ యోధ’ టైటిల్ తో తెరకెక్కే ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నాడట. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ మరో కీలక పాత్రలో నటిస్తాడట. ఈరోజు ఈ మూవీకి గురించి మరిన్ని డిటెయిల్స్ ను పంచుకోనుంది నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

Related Posts