సరికొత్త రికార్డు సృష్టించిన ‘పుష్ప 2‘ టీజర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా మరోసారి సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయబోతున్న చిత్రం ‘పుష్ప 2‘. ఇటీవలే ‘పుష్ప 2‘ నుంచి బన్నీ బర్త్ డే స్పెషల్ గా టీజర్ రిలీజయ్యింది. పుష్ప మాస్ జాతర షురూ అంటూ ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ టీజర్.. యూట్యూబ్ లో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలై 138 గంటలు దాటినా.. ఇంకా యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతూ కొత్త రికార్డు నెలకొల్పింది ఈ మాస్ టీజర్.

ఇప్పటివరకూ 110 మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టిన ఈ టీజర్.. 1.55 మిలియన్ల లైక్స్ సాధించింది. ఇక.. ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో ఒకటి ‘పుష్ప 2‘. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ వంటి వారు కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Related Posts