టీజర్ రెడీ ‘బ్రో’

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 28న విడుదల చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించి పవన్ కళ్యాణ్‌ పార్ట్ ఎప్పుడో పూర్తి చేశారు. అయితే ఫస్ట్ లుక్స్ తప్ప ఇప్పటి వరకూ పెద్దగా అప్డేట్స్ ఏం ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా టీజర్ ఎప్పుడు అని అడుగుతూ వస్తున్నారు

. వారి కోసం సర్ ప్రైజింగ్ గా టీజర్ వచ్చేస్తుందని అనౌన్స్ చేసింది టీమ్. ఈ బుధవారం బ్రో టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ మాత్రం అద్దిరిపోయిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్‌ తమ్ముడు సినిమాలోని పాట లుక్ లో ఉంటే దానికి సిమిలార్ సాయితేజ్ కూడా ప్యాంట్ పై లుంగీ కట్టి మెడలో ఎర్ర తువ్వాలు చుట్టుకుని ఉన్నాడు. ఇద్దరూ గాగుల్స్ పెట్టుకున్నారు. చూస్తోంటే ఇది ఓ పాటలోని స్టెప్ కు సంబంధించిన స్టిల్ అనిపిస్తోంది.


కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్ ఫీమేల్ లీడ్స్ చేస్తోన్న ఈ మూవీలో బ్రహ్మానందం, రోహిణి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదాయ సీతమ్ కు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌ దేవుడు పాత్రలో కనిపించబోతుండటం విశేషం. గతంలో ఇదే తరహాలో గోపాలా గోపాలాలోనూ శ్రీ కృష్ణుడి పాత్రలో నటించాడు పవన్. ఇక మేనమామ, మేనల్లుడు కలిసి నటించిన ఫస్ట్ మూవీ కావడంతో ఈ బ్రో పై మంచి అంచనాలే ఉన్నాయి.

Related Posts