నాలుగేళ్లలో వంద సినిమాల టార్గెట్

తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత తక్కువ టైమ్ లోనే తమదై ముద్ర వేసిన నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. వైవిధ్యమైన సినిమాలతో చాలా వేగంగా కొత్త ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకుంటూ దూసుకుపోతోందీ సంస్థ. ఇప్పటికే గూఢచారి, ఓ బేబీ, వెంకీమామ, రాజారాజచోర, కార్తికేయ2, ధమాకా వంటి ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ ఈ బ్యానర్ లో వచ్చి ఉన్నాయి. ఇంకా లైనప్ లో చాలా చిత్రాలే ఉన్నాయి. వరుసగా సినిమాలు చేస్తూ అస్సలే మాత్రం గ్యాప్ తీసుకోకుండా తమ ప్రొడక్షన్ హౌస్ ను నిత్యం పచ్చగా ఉండేలా సరైన ప్లానింగ్ తో వెళుతున్నట్టుగా ఈ ప్రొడక్షన్ హౌస్ అధినేత టిజి విశ్వప్రసాద్ చెబుతున్నాడు.


ఇక ఈ బ్యానర్ నుంచి రాబోయే చిత్రాలన్నీ క్రేజీ ప్రాజెక్ట్ లే. అందులో ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ కూడా ఉంది. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందే ఈ మూవీతో తమ బ్యానర్ దేశవ్యాప్తంగా విస్తరించబోతోంది అని చెబుతున్నారు. అలాగే వచ్చే నెల 28న విడుదల కాబోతోన్న పవన్ కళ్యాన్‌ ‘బ్రో’ మూవీ ఈ బ్యానర్ లో రూపొందిందే. ఇక లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రూపొందిన ఈగిల్ మూవీ టీజర్ తో ఆకట్టుకుందీ సంస్థ. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.


మంచి కంటెంట్ త తమ బ్యానర్ ను అప్రోచ్ అయిన ఏ రచయిత దర్శకుడికైనా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అవకాశం ఇస్తూ వెళుతోందీ బ్యానర్. అంతేకాక ఇప్పటి వరకూ ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే ఎవరూ సాధించని రికార్డ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదీ నాలుగేళ్లలో వంద సినిమాలు నిర్మించాలనేది వీరి టార్గెట్ ట. రామానాయుడు లాంటి నిర్మాత 40యేళ్లకు కాని వంద చిత్రాల వరకూ రాలేకపోయారు. అలాంటిది వీరు మాత్రం కేవలం నాలుగేళ్లలో వంద చిత్రాలు చేయాలనుకోవడం అంటే సాహసం అనే చెప్పాలి.

ఆ సాహసాన్ని ఛేదించేందుకు మంచి టీమ్ వీరితో ఉందంటున్నారు. ఈ ప్రొడక్షన్ లోకి అడుగుపెడితే అనవసరమైన ఆలస్యాలు ఉండవు. అయితే ఎస్ లేదంటే నో.. అలా ఉంది కాబట్టి ఇంత తక్కువ టైమ్ లో అంత క్వాలిటీ చిత్రాలు రూపొందిస్తున్నారు. మరి వీళ్లు నిజంగా నాలుగేళ్లలో వంద చిత్రాలు నిర్మిస్తారా లేదా అనేది చూడాలి. .

Related Posts