‘ తండేల్ ‘ షూట్ డైరీస్ రిలీజ్

లవ్‌స్టోరి తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్‌. చందూ మొండేటి డైరెక్షన్‌లో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సగర్వంగా సమర్పిస్తున్నారు.


ఈ సినిమాకు సంబంధించిన షూట్ డైరీస్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. చై, సాయిపల్లవి డీగ్లామర్‌ రోల్‌లో కనిపిస్తున్నారు. చందూ మొండేటి క్యారెక్టరైజేషన్‌ , టేకింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారనీ. నటీనటుల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్‌గా కనిపించేలా చూసుకుంటున్నారు. త్వరలో కొన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో వస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Related Posts