గోట్‌ లైఫ్‌ సినిమా స్టార్ట్‌ చేయడానికే పదేళ్లు పట్టింది – పృధ్విరాజ్‌ సుకుమారన్

డైరెక్టర్‌ కమ్‌ స్టార్‌ హీరో పృధ్విరాజ్‌ సుకుమారన్‌ ప్రిస్టీజియస్ ఫిల్మ్‌ ‘ది గోట్‌ లైఫ్ (ఆడు జీవితం)’. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి బెన్యామిన్ రాసిన ది గోట్‌ డేస్‌ అనే నవల. ఇదొక వాస్తవ గాధ. విజువల్ రొమాన్స్ బ్యానర్ రూపొందించిన ఈ సినిమాను తెలుగు వెర్షన్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. మార్చి 28 న పాన్ ఇండియా రేంజ్‌ లో రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది చిత్ర యూనిట్‌.

ఇటీవల వరదరాజ మన్నార్ అనే కింగ్ క్యారెక్టర్ లో సలార్ తో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాతో నజీబ్ అనే స్లేవ్ క్యారెక్టర్ తో తెరపైకి రాబోతున్నాను. వరదరాజ మన్నార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇమాజినేషన్. కానీ ఈ సినిమా వాస్తవంగా జరిగిన కథ. నజీబ్ మన మధ్యే సజీవంగా ఉన్నాడు. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వ్యక్తి అతను. ఈ ప్రయాణంలో తను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ రాసిన పుస్తకమే గోట్ డేస్. బెన్యామిన్ రాసిన ఈ పుస్తకం కేరళలో 2008లో పబ్లిష్ అయ్యింది. ఇది పబ్లిష్ అవగానే ప్రతి ఒక్కరి చేతుల్లోకి వెళ్లింది. అంత ఆదరణ పొందింది గోట్ డేస్. కేరళలో ప్రతి దర్శకుడు, హీరో, ప్రొడ్యూసర్ ఈ నవల హక్కులు తీసుకోవాలని ప్రయత్నించారు.

చివరకు ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ సాధించారు. అదృష్టవశాత్తూ నజీబ్ గా నటించే అవకాశం నాకు దక్కింది. 2009 ప్రారంభంలో ఈ సినిమాకు కమిట్ అయ్యాం. అయితే ఆ టైమ్ లో ఈ సినిమాకు కావాల్సిన బడ్జెట్ ఖర్చు చేయడం అసాధ్యంగా ఉండేది. పదేళ్ల తర్వాత 2018లో షూటింగ్ ప్రారంభించాం. అప్పటికి ప్రాంతీయ సినిమాల మార్కెట్ స్థాయి పెరిగింది. మలయాళ సినిమాలకు ఆదరణ పెరిగింది. 2019లో షూటింగ్ ప్రారంభించాం. జోర్డాన్ లో షెడ్యూల్ చేశాం. కేరళ పోర్షన్స్ కంప్లీట్ చేశాం.

నేను ఈ సినిమా కోసం మొదట బరువు పెరిగి ఆ తర్వాత 31 కిలోలు తగ్గాను. బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. ఇప్పటికి కూడా ఈ సినిమా బడ్జెట్ రిస్కు చేయడమే. మేము తిరిగి జోర్డాన్ లో షూటింగ్ స్టార్ట్ చేసేప్పటికి కోవిడ్ లాక్ డౌన్ వచ్చింది. మూడు నెలలు పూర్తిగా షూటింగ్ ఆపేశాం. మేము భారత్ కు తిరిగి రావడం కూడా కష్టమైంది. వందే భారత్ స్పెషల్ ఫ్లైట్ లో ఇండియా వచ్చాం. పాండమిక్ ఎప్పటికి ఆగిపోతుందో తెలియదు. ఏడాదిన్నర తర్వాత అల్జీరియాలోని టిముమౌన్ అనే ప్లేస్ లో షూటింగ్ స్టార్ట్ చేశాం. సహార ఎడారి మధ్యలో ఉంటుందా లొకేషన్. అక్కడికి ఏ సినిమా యూనిట్ వెళ్లలేదు. మా బ్లెస్సీ సార్ కు సినిమా పిచ్చి. ఆయన వల్లే మేమంతా అక్కడ షూటింగ్ చేయగలిగాం. బ్లెస్సీ సార్ తో మలయాళ ఇండస్ట్రీ ప్రతి ఆర్టిస్ట్ ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారు. అంత గొప్ప దర్శకుడాయన అన్నారు హీరో పృధ్విరాజ్ సుకుమారన్‌.
దర్శక నిర్మాతలు, ఇతర ఆర్టిస్టులు సినిమా అనుభవాలతో పాటు విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

Related Posts