టాలీవుడ్

తమన్నా అఫీషియల్ గానే చెప్పేసింది

ఇండస్ట్రీలో ఎఫైర్స్ కామన్ గానే కనిపిస్తాయి. కానీ అన్ని ఎఫైర్స్ మూడు ముళ్ల వరకూ వెళ్లవు. కొన్ని మధ్యలో ఆగిపోతాయి. మరికొన్ని గొడవలతో ముగుస్తాయి. అందుకే ఇవన్నీ ఓ తీరం చేరేవరకూ జనాలు పెద్దగా నమ్మరు. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో తమన్నా గురించి పెద్దగా రూమర్స్ రాలేదు అనే చెప్పాలి.

అప్పుడప్పుడూ ‘ఓ’ బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకోబోతోంది అనే రొటీన్ మాటలు వినిపించాయి తప్ప.. ఫలానా వ్యక్తితో డేటింగ్ లో ఉంది.. ఫలానా హీరోతో ఎఫైర్ లో ఉందనే న్యూస్ ఎప్పుడూ వినిపించలేదు. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఓ చిన్న నటుడుతో కలిసి కనిపిస్తే మొదట అనుమానించారు. తర్వాత కావొచ్చు.. కాకపోవచ్చు అనుకున్నారు. కానీ తమన్నా ఎప్పుడూ ఈ విషయాన్ని దాచి పెట్టలేదు.

దాగుడుమూతలాడలేదు. అతనితో కలిసిన తర్వాత నుంచి బయట కూడా కలిసే కనిపిస్తోంది. ఇక ఇంతకీ అతనెవరో తెలుసు కదా.. విజయ్ వర్మ. తెలుగులో నాని హీరోగా నటించిన ఎమ్.సి.ఏ చిత్రంలో విలన్ గా నటించాడు. అయితే బాలీవుడ్ చాలా బిజీ యాక్టర్ అతను. వైవిధ్యమైన పాత్రలతో అద్భుతమైన నటన చూపించగలడు. ఈ ఇద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్2లో నటించారు. అప్పటి నుంచే ప్రేమ చిగురించింది. తర్వాత మొగ్గ తొడిగి ఇదుగో ఇలా అఫీషియల్ ప్రకటించేంత వరకూ వెళ్లింది.


అతనితో రిలేషన్ గురించి లేటెస్ట్ గా మీడియా అడిగితే తనేం చెప్పిందో తెలుసా.. ? “”నేను నా కోసం ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. నేను ఏమీ చేయకుండానే ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అతను నాపై చాలా శ్రద్ధ వహించే వ్యక్తి. అవును, అతను నా సంతోషానికి చిరునామా” ఇదీ తమన్నా చెప్పిన మాట. అంటే ప్రేమలో ఉన్నానని కన్ఫార్మ్ చేసింది. మరి ఈ ప్రేమ పెళ్లి వరకూ వెళుతుందా లేదా అనేది అప్పుడే చెప్పకూడదు.అసలే ఇవి సినిమా వాళ్ల ప్రేమలు.

Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

3 hours ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

3 hours ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

3 hours ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

9 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

9 hours ago